శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో వన్యప్రాణుల స్మగ్లింగ్ ముఠా సంచారం

ABN , First Publish Date - 2021-01-25T19:28:33+05:30 IST

నల్లమల అడవుల్లోని శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో వన్యప్రాణుల స్మగ్లింగ్ ముఠా సంచరిస్తోన్నట్లు అటవీశాఖా అధికారులు అనుమానిస్తున్నారు.

శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో వన్యప్రాణుల స్మగ్లింగ్ ముఠా సంచారం

కర్నూలు : నల్లమల అడవుల్లోని శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో వన్యప్రాణుల స్మగ్లింగ్ ముఠా సంచరిస్తోన్నట్లు అటవీశాఖా అధికారులు అనుమానిస్తున్నారు. సోమవారం శ్రీశైలం హఠకేశ్వరం సమీపంలోని అటవీ ప్రాంతంలో ముగ్గురు అనుమానితులను ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుల వద్ద చిరుతపులి చర్మం ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. శ్రీశైలం అటవీ ప్రాంతంలోని చిరుత పులులను చంపి వాటి చర్మాన్ని స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. అనుమానితులను అధికారులు రహస్యంగా విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలను వెల్లడిస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. 


Updated Date - 2021-01-25T19:28:33+05:30 IST