ఢిల్లీని 80% నాశనం చేస్తారా: కేజ్రీ

ABN , First Publish Date - 2022-05-17T08:07:38+05:30 IST

ఢిల్లీలో బీజేపీపాలిత నగరపాలక సంస్థల పరిధిలో ఆక్రమణల తొలగింపు ప్రత్యేక డ్రైవ్‌పై ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు.

ఢిల్లీని 80% నాశనం చేస్తారా: కేజ్రీ

న్యూఢిల్లీ, మే 16: ఢిల్లీలో బీజేపీపాలిత నగరపాలక సంస్థల పరిధిలో ఆక్రమణల తొలగింపు ప్రత్యేక డ్రైవ్‌పై ఆమ్‌ ఆద్మీ పార్టీ చీఫ్‌, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ మండిపడ్డారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బీజేపీ చేస్తున్న అతిపెద్ద విధ్వంసమని విమర్శించా రు. అక్రమణల తొలగింపుపై చర్చించడానికి సోమవారం ఆప్‌ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమయ్యారు. ఢిల్లీ ప్రణాళికాబద్ధంగా నిర్మితమైనది కాదని, 75 ఏళ్ల నుంచి క్రమంగా అభివృద్ధి చెందుతూ వస్తోందని కేజ్రీవాల్‌ అన్నారు. అందువల్ల 80ు ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలుగానే పరిగణించే అవకాశం ఉందన్నారు. అంటే.. బీజేపీ ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా 80ు ఢిల్లీని నాశనం చేస్తుందా? అని ప్రశ్నించారు.

Updated Date - 2022-05-17T08:07:38+05:30 IST