యోగి రెడీ.. మీ మాటేంటి..?: బీజేపీ సూటి ప్రశ్న

ABN , First Publish Date - 2022-01-18T00:34:51+05:30 IST

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్‌ పేరును ఇప్పటికే ప్రకటించిన..

యోగి రెడీ.. మీ మాటేంటి..?: బీజేపీ సూటి ప్రశ్న

లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా యోగి ఆదిత్యనాథ్‌ పేరును ఇప్పటికే ప్రకటించిన బీజేపీ తాజాగా విపక్ష నేతలపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. అఖిలేష్ యాదవ్ (ఎస్‌పీ), మాయావతి (బీఎస్‌పీ), ప్రియాంక గాంధీ వాద్రా (కాంగ్రెస్) పోటీకి దిగుతున్నారో లేదో ప్రజలకు చెప్పాలని సవాలు విసిరింది. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారా అని ఓ ట్వీట్‌లో బీజేపీ రాష్ట్ర విభాగం ప్రశ్నించింది. 18 ఏళ్ల తర్వాత యూపీ సిట్టింగ్ ఎంపీ (యోగి ఆదిత్యనాథ్) ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని పేర్కొంది. ఎన్నికల్లో పోటీ విషయం మరిచిపోయిన నేతలు కనీసం నొయిడాలో కూడా పర్యటించలేదంటూ ఛలోక్తులు విసిరింది. యూపీ అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10తో మొదలై ఏడు విడతల్లో పూర్తి కానున్నాయి. మార్చి 10న ఫలితాలు వెలువడతాయి.

Updated Date - 2022-01-18T00:34:51+05:30 IST