అనన్య నాగళ్ళ ఈ సక్సస్‌తో స్టార్ హీరోయిన్ అవుతుందా..?

Apr 23 2021 @ 08:49AM

అనన్య నాగళ్ళ 'మల్లేశం' సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయి 'వకీల్ సాబ్' సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో నివేథా థామస్, అంజలిలతో పోటీ పడి నటించిన అనన్య ప్రేక్షకులను బాగా మెప్పించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ సినిమాగా వచ్చిన 'వకీల్ సాబ్' సినిమా దేశ వ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రేమికులను బాగా ఆకట్టుకుంది. పవర్ స్టార్ స్టామినాకి సరిపోయే సినిమాగా దర్శకుడు వేణు శ్రీరాం ఈ సినిమాని తెరకెక్కించాడు. బాలీవుడ్, కోలీవుడ్‌లలో వచ్చిన కథ అయినప్పటికి మన తెలుగు ప్రేక్షకులు నచ్చేలా .. పవర్ స్టార్ ఇమేజ్‌కి తగ్గట్టుగా కథలో చేసిన మార్పులు అద్భుతంగా ఆకట్టుకున్నాయి.

 

ముగ్గురు అమ్మాయిల చుట్టూ తిరిగే కథని పవన్ కళ్యాణ్ ఒప్పుకోవడం గొప్ప విషయం అయితే.. మంచి సోషల్ మెసేజ్‌తో ఈ కథ పవన్ కళ్యాణ్ ద్వారా అయితేనే ప్రేక్షకులకు బాగా రీచవుతుందన్న దర్శక, నిర్మాతల ఆలోచన..పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పర్‌ఫెక్ట్‌గా వర్కౌట్ అయ్యాయి. అంతేకాదు కీలకమైన పాత్రల్లో నటించిన ముగ్గురు అమ్మాయిలు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో అనన్య నాగళ్ళకి తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి పేరు వచ్చింది. దాంతో తనకి మంచి అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తోంది. వకీల్ సాబ్ సక్సస్‌తో అనన్య కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటోంది. మరి క్రేజ్‌తో అనన్య నాగళ్ళ టాలీవుడ్‌లో యంగ్ హీరోల సరసన అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ అవుతుందా చూడాలి. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.