పెట్రో ధరలు తగ్గనున్నాయా ?

Aug 27 2021 @ 13:43PM

న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. కాగా... మంగళవారం పెట్రోల్ 15 పైసలు, డీజిల్ 15 పైసలు తగ్గిన విషయం తెలిసిందే. నెల రోజులకు పైగా స్థిరంగా ఉన్న పెట్రోల్ ధరలు ఈ ఆదివారం కాస్త తగ్గాయి. డీజిల్ ధరలు ఇటీవల పలుమార్లు తగ్గాయి. ఇక 35 రోజులు స్థిరంగా ఉన్న పెట్రోల్ ధర ఆదివారం 15-20 పైసలు తగ్గింది. అదే సమయంలో డీజిల్ ధరలు గతవారం మొదట మూడు రోజులు తగ్గి, ఒకరోజు స్థిరంగా ఉన్న తర్వాత... ఆదివారం మళ్లీ తగ్గాయి. ఆదివారం డీజిల్ 18-20 పైసల మధ్య తగ్గింది. ఇటీవలి వరకు నెల రోజులకు పైగా ధరల్లో మార్పులేదు. పెట్రోల్ ధరలు చివరిసారి జూలై 17 న పెరిగాయి. డీజిల్ ధరలు జూలై 15 నుండి స్థిరంగా ఉన్నాయి.


అంతర్జాతీయ మార్కెట్ ధరలకణుగుణంగా దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయన్నన విషయం తెలిసిందే. చివరిసారి... కిందటి నెలలో పెట్రోల్ ధక 30 పైసలు పెరిగింది. గత నెల(జూలై)లో ఇంధన ధరలు పదిసార్లు పెరిగాయి. ఈ నెల(ఆగస్టు)లో ధరలు ఇప్పటి వరకు పెరగలేదు. పైగా డీజిల్ ధరలు ఐదుసార్లు, పెట్రోల్ ధర రెండుసార్లు తగ్గాయి. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.


దేశ రాజధాని ఢిల్లీలో ధరల విషయానికొస్తే... పెట్రోల్ రూ. 101.49, లీటర్ డీజిల్ రూ.88.92 గా ఉన్నాయి. ముంబైలో పెట్రోల్ రూ. 107.52, డీజిల్ రూ. 96.48 గా ఉన్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర ప్రాంతాల్లో పెట్రోల్ ధరలు రూ. 110 దాటాయి. దేశంలోని పలు ఇతర ప్రాంతాల్లో పెట్రోల్ ధర రూ. 100 దాటింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అమరావతి, తిరువనంతపురంలలో సెంచరీ అధిగమించింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ. 105.63, డీజిల్ రూ. 97.16గా ఉన్నాయి.


ఇక... పెట్రోల్ ధర రూ. 100 దాటిన నగరాల్లో ఢిల్లీ, కోల్‌కతా, భోపాల్, చెన్నై, జైపూర్, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, పట్నా, తిరువనంతపురం, భువనేశ్వర్ తదితర నగరాలున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్లో కేంద్ర, రాష్ట్ర పన్నుల వాటానే అధికంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. పెట్రోల్ ధరలో 60 శాతం, డీజిల్ ధరలో 54 శాతం పన్నుల వాటానే. కేంద్రం పెట్రోల్ పైన రూ. 32.90, డీజిల్ పై రూ. 31.80 చొప్పున పన్నులను వసేూలు చేస్తోంది. 


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.