Farooq Abdullah : ఎన్నికల్లో పోటీకి సిద్ధమే

ABN , First Publish Date - 2021-09-08T22:37:53+05:30 IST

జమ్మూ కశ్మీర్‌లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా, తాము సిద్ధంగానే ఉన్నామని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్

Farooq Abdullah : ఎన్నికల్లో పోటీకి సిద్ధమే

శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా, తాము సిద్ధంగానే ఉన్నామని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా ప్రకటించారు. అయితే పరిపూర్ణమైన రాష్ట్ర హోదా కోసం తమ పోరాటం మాత్రం కొనసాగుతూనే ఉంటుందని పునరుద్ఘాటించారు. ఓ వైపు ఎన్నికల్లో పోటీ చేస్తూనే, పరిపూర్ణమైన రాష్ట్ర హోదా కోసం పోరాటం చేస్తూనే ఉంటామని ఆయన ప్రకటించారు. అయితే ఎన్నికల తేదీలను ఎప్పుడు ప్రకటిస్తారన్నది తమకు తెలియదని, కానీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న స్పష్టమైన సంకల్పంతోనే ఉన్నామని  ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. 

Updated Date - 2021-09-08T22:37:53+05:30 IST