కష్టకాలంలో రైతుల భూములు వేలం వేస్తారా..?

ABN , First Publish Date - 2022-01-25T05:54:24+05:30 IST

పంటల పండక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే అప్పులు కట్టాలనీ, లేకపోతే భూ ములు వేలం వేస్తామని సహకార బ్యాంకు నోటీసులివ్వడం దా రుణమని మాజీ మంత్రి, టీడీపీ అనంతపురం పార్లమెంటు ని యోజకవర్గ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు.

కష్టకాలంలో రైతుల భూములు వేలం వేస్తారా..?
మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు

అన్నదాతలపై వైసీపీ కక్ష సాధింపు... మాజీ మంత్రి కాలవ ఫైర్‌

అనంతపురం వైద్యం, జనవరి24: పంటల పండక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే అప్పులు కట్టాలనీ, లేకపోతే భూ ములు వేలం వేస్తామని సహకార బ్యాంకు నోటీసులివ్వడం దా రుణమని మాజీ మంత్రి, టీడీపీ అనంతపురం పార్లమెంటు ని యోజకవర్గ అధ్యక్షుడు కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. సోమవారం సహకార బ్యాంకు వేలం నోటీసులపై సీరియ్‌సగా స్పందించిన ఆయన.. జిల్లా కలెక్టర్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కష్టాలతోపాటు పంటలు దెబ్బతింటుండడంతో రైతుల బతుకులు దారుణంగా ఉన్నాయన్నారు. 2018లో నష్టపోయిన పంటలకు 2019 జూనలో చెల్లించాల్సిన రూ.936 కోట్ల ఇనపుట్‌ సబ్సిడీ ఇప్పటికీ మంజూరు చేయలేదన్నారు. గతేడాది కూడా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ఈసారి ఖరీఫ్‌, రబీ పంటలు దెబ్బతిన్నాయన్నారు. తీవ్ర ఆందోళనలో ఉన్న రైతులను ఆదుకోవాల్సిందిపోయి.. వారి భూములను వేలం వేసి, రుణాలను రాబట్టాలనుకోవడం అమానుషమన్నారు. రైతులపై వైసీపీ కక్ష పూరిత చర్యలకు దిగుతోందన్నారు. ఏటా పంట నష్టపోతున్నా.. వ్యవసాయాన్నే నమ్ముకుని బతుకుతున్న రైతుల భూములను వేలం వేయడానికి ఈ ప్రభుత్వానికి మనుసెలా వచ్చిందని ప్రశ్నించారు. ఈనెల 31 వరకు వేలం గడువిస్తూ నోటీసులిచ్చానీ, వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే అన్నదాతల తరపున టీడీపీ ప్రత్యక్ష ఆందోళనకు దిగుతుందని హెచ్చరించారు.


Updated Date - 2022-01-25T05:54:24+05:30 IST