బూస్టర్ డోసుపై జో బైడెన్ కీలక ప్రకటన.. జిల్ బైడెన్‌తో కలిసి..

ABN , First Publish Date - 2021-08-20T21:04:32+05:30 IST

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా ప్రథమ మహిళ, జిల్ బైడెన్‌తో కలిసి కొవిడ్ బూస్టర్ టీకాను తీసుకోనున్నట్టు వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొ

బూస్టర్ డోసుపై జో బైడెన్ కీలక ప్రకటన.. జిల్ బైడెన్‌తో కలిసి..

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక ప్రకటన చేశారు. అమెరికా ప్రథమ మహిళ, జిల్ బైడెన్‌తో కలిసి కొవిడ్ బూస్టర్ టీకాను తీసుకోనున్నట్టు వెల్లడించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. అగ్రరాజ్యం అమెరికాను డెల్టా వేరియంట్ వణికిస్తోంది. డెల్టా వేరియంట్ కారణంగా అధిక మొత్తంలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీంతో అక్కడి వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికన్లకు బూస్టర్ టీకాను ఇవ్వాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొవిడ్ టీకా బూస్టర్ డోసును ఇచ్చేందుకు బైడెన్ ప్రభుత్వం సిద్ధం అయింది. దీంతో సెప్టెంబర్‌లో బూస్టర్ డోసు అమెరికన్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో అధ్యక్షుడు జో బైడెన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తన భార్యతో కలిసి డిసెంబర్‌లో తాను కొవిడ్ టీకా బూస్టర్ డోసును తీసుకోనున్నట్టు వెల్లడించారు. 


ఇదిలా ఉంటే.. బూస్టర్ డోసు కోసం అగ్రరాజ్యం సన్నహాలు ప్రారంభించిన తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. బూస్టర్ డోసు కోసం తొందరపాటు వొద్దని సూచించింది. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం.. కొవిడ్ బూస్టర్ డోసు అవసరం ఇప్పుడైతే లేదు’ అని పేర్కొన్నారు. 


Updated Date - 2021-08-20T21:04:32+05:30 IST