అయోధ్యపై Salman Khurshid రాసిన పుస్తకాన్ని నిషేధిస్తాం...

ABN , First Publish Date - 2021-11-12T17:55:02+05:30 IST

అయోధ్యపై కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకంపై మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు...

అయోధ్యపై Salman Khurshid రాసిన పుస్తకాన్ని నిషేధిస్తాం...

మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా వెల్లడి

భోపాల్: అయోధ్యపై కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకంపై మధ్యప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా సంచలన వ్యాఖ్యలు చేశారు.‘హిందుత్వ’ను రాడికల్ ఇస్లామిస్ట్ టెర్రర్ గ్రూపులతో పోలుస్తూ సల్మాన్ ఖుర్షిద్ రాసిన పుస్తకం  ఖండించదగినదని మంత్రి మిశ్రా చెప్పారు. హిందువులను విభజించే లేదా మన దేశాన్ని విభజించేలా మాట్లాడే వారిపై మంత్రి విరుచుకుపడ్డారు.‘భారత్ తుక్డే హోంగే’ అన్న వారి వద్దకు రాహుల్ గాంధీ మొదట వెళ్లలేదా? అందుకే రాహుల్ ఎంజెండాలో సల్మాన్ ఖుర్షీద్ పని చేస్తున్నారని మిశ్రా విలేకరులతో చెప్పారు. మహాన్ భారత్ కాదు బద్నామ్ భారత్ అని మాజీ సీఎం కమల్ నాథ్ వ్యాఖ్యానించారని మిశ్రా చెప్పారు.


 హిందూత్వ అనేది ఒక జీవన విధానం అని సుప్రీంకోర్టు కూడా చెప్పిందని, అలాంటప్పుడు ప్రశ్నించడానికి ఏముందని మిశ్రా అన్నారు. సల్మాన్ ఖుర్షీద్ రాసిన పుస్తకం ‘సన్‌రైజ్ ఓవర్ అయోధ్య: నేషన్‌హుడ్ ఇన్ అవర్ టైమ్స్’పై వివాదం చెలరేగింది.రాజకీయంగా కీలకమైన ఉత్తరప్రదేశ్, ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌తో సహా వచ్చే ఏడాది ఏడు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనుండగా, ముస్లిం ఓట్లను పొందేందుకు కాంగ్రెస్ మత రాజకీయాలు చేస్తుందని మంత్రి ఆరోపించారు.తాను మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయనిపుణులను సంప్రదించి రాష్ట్రంలో సల్మాన్ ఖుర్షిద్ పుస్తకాన్ని నిషేధిస్తామని మంత్రి మిశ్రా వివరించారు.


Updated Date - 2021-11-12T17:55:02+05:30 IST