ట్రంప్ ఛానల్‌పై నిషేధాన్ని అప్పుడే ఎత్తేస్తాం: యూట్యూబ్ సీఈఓ

ABN , First Publish Date - 2021-03-06T00:33:38+05:30 IST

ట్రంప్‌కు సంబంధించిన యూట్యూబ్ ఛానల్‌పై నిషేధాన్ని ఎత్తేసే విషయంపై యూట్యూబ్ సీఈఓ కీలక ప్ర

ట్రంప్ ఛానల్‌పై నిషేధాన్ని అప్పుడే ఎత్తేస్తాం: యూట్యూబ్ సీఈఓ

వాషింగ్టన్: ట్రంప్‌కు సంబంధించిన యూట్యూబ్ ఛానల్‌పై నిషేధాన్ని ఎత్తేసే విషయంపై యూట్యూబ్ సీఈఓ కీలక ప్రకటన చేశారు. హింస చెలరేగే అవకాశాలు తగ్గిన తర్వాత ట్రంప్‌కు చెందిన యూట్యూబ్ ఛానెల్‌పై నిషేధాన్ని ఎత్తేస్తామని యూట్యూబ్ సీఈఓ సుసాన్ వోజ్కికి పేర్కొన్నారు. హింస చెలరేగే అవకాశాలు తగ్గాయా.. లేదా అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి ప్రభుత్వం చేస్తున్న హెచ్చరికలను, రెచ్చగొట్టే ప్రకటలను యూట్యూబ్ పరిశీలిస్తున్నట్టు సుసాన్ వోజ్కికి వెల్లడించారు. యూఎస్ కేపిటల్‌లో హింస చెలరేగే అవకాశాలు ఉన్నాయని పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు. హింస చెలరేగే అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నట్టు తాము భావిస్తున్నామని సుసాన్ వోజ్కికి పేర్కొన్నారు. కాగా.. జనవరి 6న కేపిటల్ భవనం వద్ద ట్రంప్ మద్దతుదారులు హల్‌చల్ చేసిన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాద్యమాలు ట్రంప్‌పై నిషేధం విధించాయి. ఈ క్రమంలోనే యూట్యూబ్ కూడా ట్రంప్‌కు సంబంధించిన యూట్యూబ్ ఛానల్‌పై తాత్కాలిక నిషేధం విధించిందిన విషయం తెలిసిందే. 


Updated Date - 2021-03-06T00:33:38+05:30 IST