నెల వ్యవధిలో నేరాలను అదుపు చేయకుంటే.. రాష్ట్రపతిని కలుస్తాం : తేజస్వీ

ABN , First Publish Date - 2021-01-17T20:07:53+05:30 IST

నెల వ్యవధిలో రాష్ట్రంలోని నేరాలను ప్రభుత్వం అదుపు చేయకుంటే తాము రాష్ట్రపతిని కలుస్తామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించారు.

నెల వ్యవధిలో నేరాలను అదుపు చేయకుంటే.. రాష్ట్రపతిని కలుస్తాం : తేజస్వీ

పాట్నా : నెల వ్యవధిలో రాష్ట్రంలోని నేరాలను ప్రభుత్వం అదుపు చేయకుంటే తాము రాష్ట్రపతిని కలుస్తామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రకటించారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామని పాత్రికేయుల సమావేశంలో తెలిపారు. ఏకంగా సీఎం నితీశ్ ఇంటి దగ్గరే ఇండిగో ఏయిర్‌లైన్స్ రూపేశ్ కుమార్ హత్య జరిగిన నేపథ్యంలో తేజస్వీ పై వ్యాఖ్యలు చేశారు. హత్యలు, దోపిడీలు, కిడ్నాప్‌లు రాష్ట్రంలో ఊహించనంత స్థాయిలో పెరిగాయయని, ఇంత స్థాయిలో క్రైమ్ పెచ్చుమీరుతున్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘బిహార్ నేర రాజధానిగా మారింది. అయినా నేరాలను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రజల దుస్థితిని ఏమని చెప్పాలి? సామాన్య ప్రజానీక గొంతును ప్రభుత్వం వినడం లేదు. ఎవరు ఫోన్లు చేసినా ప్రభుత్వ అధికారులు స్పందించడం లేదు. వచ్చే నెలకల్లా నేరాలను అదుపు చేయకుంటే ప్రతిపక్షం మొత్తం రాష్ట్రపతిని కలుస్తాం. రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలపై ఫిర్యాదు చేస్తాం.’’ అని తేజస్వీ హెచ్చరించారు. 

Updated Date - 2021-01-17T20:07:53+05:30 IST