ప్రియా ప్రకాష్ హిట్ కొడుతుందా..?

Apr 18 2021 @ 11:01AM

ప్రియా ప్రకాష్ గత మూడేళ్ళ నుంచి తను కన్ను కొట్టిన వీడియోనూ ఎంతమంది ఎన్ని సార్లు రివైండ్ చేసి చూసుకొని ఉంటారో లెక్కే లేదు. ఇరవై నుంచి అరవై ఏళ్ళ వరకు అందరూ ఈ వీడీయోకి ఫ్యాన్స్ అయ్యారంటే ప్రియా కన్ను కొట్టి ఎంతగా గాలేం వేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ స్టార్ హీరో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ని కూడా ప్రియ ప్రకాష్ కన్నుకొట్టి ఫ్లాట్ చేసింది. తన డెబ్యూ సినిమా ఒరు ఆదార్ లవ్ ప్రమోషన్స్‌కి గెస్ట్‌గా వచ్చిన అల్లు అర్జున్ .. ప్రియా ప్రకాష్‌ని ఎంతగా పొగిడేశాడో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో బన్నీతో సినిమా ఛాన్స్ అందుకోవడం గ్యారెంటీ అన్న టాక్ కూడా వచ్చింది. ఒక చిన్న వీడియో బైట్‌తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులు ఫ్లాటయ్యేలా చేసింది ప్రియా ప్రకాష్.


 

ఇక డెబ్యూ సినిమా ఒరు అదార్ లవ్ రిలీజ్ కాకుండానే బాలీవుడ్‌లో శ్రీదేవి బంగళా సినిమా చేసింది ప్రియా ప్రకాష్. ఈ సినిమా ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. గ్యారెంటీగా పెద్ద హీరోయిన్ అవుతుందని శ్రీదేవి బంగళా ట్రైలర్ చూసిన వాళ్ళు అభిప్రాయపడ్డారు కూడా. కానీ అందాల తార శ్రీదేవికి సంబంధించిన విషయాలను శ్రీదేవి బంగళాలో చూపించారని ఆరోపణలు ఎదుర్కోవడంతో సినిమా రిలీజ్ కాకుండా నిలిపి వేశారు.

ఇదే సమయంలో డెబ్యూ సినిమా రిలీజయ్యాక చూసిన అందరు ప్రియా ప్రకాష్‌ది చెప్పుకునే క్యారెక్టర్ కాదన్న కామెంట్స్ చేశారు. దాంతో తను ఊహలన్ని గాలిలో కలిసిపోయాయి. ఇక లక్కీగా నితిన్ నటించిన చెక్ సినిమాలో అవకాశం వచ్చింది. కానీ ఈ సినిమా యంగ్ బ్యూటీకి ఉపయోగపడలేదు. ప్రస్తుతం తేజ సజ్జాతో ఇష్క్ సినిమా చేసి మరోసారి తన లక్‌ని చెక్ చేసుకోబోతోంది. ఈ సినిమా థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కింది. సినిమా ఈనెల 23న ఇష్క్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. చూడాలి మరి ప్రియా ప్రకాష్ ఇష్క్ సినిమాతో హిట్ కొడుతుందా లేదా. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.