భూములు కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా

ABN , First Publish Date - 2021-05-07T06:27:41+05:30 IST

ఆలేరు నియోజకవర్గంలో ఎక్కడైనా గుంట భూమిని కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే, డీసీసీబీ పదవులకు రాజీనామ చేస్తానని, లేని పక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా? అని బండి సంజయ్‌కి డీసీసీబీ చైర్మన్‌, టెస్కాబ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

భూములు కబ్జా చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా
గుట్టలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మహేందర్‌రెడ్డి

రాష్ట్ర అధ్యక్ష పదవికి మీరు రాజీనామ చేస్తారా?

బండి సంజయ్‌కు  గొంగిడిమహేందర్‌రెడ్డి సవాల్‌

యాదాద్రి రూరల్‌, మే 6: ఆలేరు నియోజకవర్గంలో ఎక్కడైనా గుంట భూమిని కబ్జా చేసినట్లు  నిరూపిస్తే ఎమ్మెల్యే, డీసీసీబీ పదవులకు రాజీనామ చేస్తానని,  లేని పక్షంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తారా? అని బండి సంజయ్‌కి డీసీసీబీ చైర్మన్‌, టెస్కాబ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి సవాల్‌  విసిరారు. గురువారం యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీపీసీసీ అధికార ప్రతినిధి అయోధ్యరెడ్డి ఆరు నెలల  క్రితం తమపై చేసిన ఆరోపణలు రుజు వు కాలేదన్నారు.  బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకుడు దాసోజు శ్రావణ్‌ తనపై ఆరోపణలు చేయడం దిగజారు తనానికి నిదర్శనమన్నారు. బండి సంజయ్‌ యాదగిరిగుట్టకు వచ్చి స్థానిక బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు, విలేకరుల సమక్షంలో   తనపై చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి పాదాల వద్ద ముక్కునేలకు రాసి వెంటనే రాజీనామ చేస్తానని స్పష్టం చేశారు. అయోధ్యరెడ్డిపై హైకోర్టులో పరువునష్టం దావావేస్తున్నట్లు ఆయన వివరించారు. సమావేశంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, మండల పార్టీ అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, జడ్పీటీసీ సభ్యురాలు తోటకూరి అనురాధబీరయ్య, మునిసిపల్‌ చైర్మన్‌ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్‌, మిట్ట వెంకటయ్యగౌడ్‌, గంజి సూర్యనారాయణ, బీర్ల మహేష్‌, ముక్కెర్ల సత్యనారాయణ, మల్లేష్‌, రాజేష్‌ పాల్గొన్నారు.

జన్మదిన వేడుకలను నిర్వహించొద్దు

కొవిడ్‌ దృష్ట్యా ఈ నెల 8 తన జన్మదిన వేడుకలను  నిర్వహించొ ద్దని ప్రజా ప్రతినిధిలకు, నాయకులకు, అభిమానులకు  డీసీసీబీ చైర్మన్‌, టెస్కాబ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డి సూ చించారు. తన కోసం వెచ్చించే డబ్బుతో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మాస్క్‌లు పంపిణీ చేయాలని సూచించారు. అనంతరం వంగపల్లి గ్రామానికి చెందిన రేగు ఎల్లమ్మ, గవ్వల బీరయ్య, మూడుగుల మధు, ఒగ్గు కిష్టయ్యకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు.

Updated Date - 2021-05-07T06:27:41+05:30 IST