వరి కలిసొచ్చేనా..!

ABN , First Publish Date - 2021-10-18T05:14:49+05:30 IST

ప్రస్తుతం కేసీ కెనాల్‌ కింద, బోర్ల కింద సాగు చేసిన వరి పంట ఈసారైనా కలిసొచ్చేనా అని అన్నదాతలు వేయి కళ్లతో వేచిచూస్తున్నారు.

వరి కలిసొచ్చేనా..!
పచ్చగా ఉన్న వరి పంట

ప్రొద్దుటూరు రూరల్‌, అక్టోబరు 17: ప్రస్తుతం   కేసీ కెనాల్‌ కింద, బోర్ల కింద  సాగు చేసిన వరి పంట ఈసారైనా కలిసొచ్చేనా అని అన్నదాతలు వేయి కళ్లతో వేచిచూస్తున్నారు. సీజన్‌ ఆరంభంలో అధిక వర్షాలు కురియడంతో ఏడాది కూ డా గతేడాదిలాగా అతివృష్టితో పంటలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన  చెందారు. అయి తే  వరినాట్లు వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వర్షాలు అధికంగా  కురియకపోవడంతో వరి పంట ప్రస్తుతానికి ఆశాజనకంగానే ఉంది. నాట్ల సమయంలో కొద్దిగా సాగు ఖర్చులు అధికమైనప్పటికి వరి నాట్లు పూర్తయినప్పటి నుంచివరి కరుకు దశకు వచ్చేంతవరకు చాలా తక్కువ ఖర్చులు అయ్యాయని రైతులంటున్నారు. సాధారణంగా ప్రతి ఏడాది వరి నాటినప్పటి నుంచి  పంట కరుకు దశకు (రెండు నెలలు)వచ్చేలోపు రెండు రౌండ్లు పురుగు మందులు పిచికారి చేసేవారు. అంతేకాకుండా ఒకమారు విషపుగుళికలు కూడా పొలంలో చల్లించేవారు. అయితే ఈ ఏడా ది గుళికలు చల్లడం కానీ, మందులు పిచికారి చేయకపోయినా వరి పంట ఆరోగ్యకరంగా ఉం దని ఇదిలాగే కొనసాగితే పంట ఎకరాకు 40 బస్తాల నుంచి 50 బస్తాలు దిగుబడి వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు రాని వర్షం పంట నూర్పిళ్ల దశలో వచ్చి తమను ఇబ్బంది పెడుతుందేమోనని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రొద్దుటూ రు మండలంలో కేసీ కెనాల్‌, బోర్ల కింద రైతులు సుమారు 8 వేల ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. ప్రస్తుతం పంట నాటి రెండు నెలలు కావస్తోంది. కొన్ని చోట్ల వరి పంట చిరు పొట్టదశలో ఉండగా మరికొన్ని చోట్ల  కరకు దశలో ఉం దని రైతులంటున్నారు. ఈసారైనా పంట బాగా వస్తేతమ కష్టాలు తీరుతాయని రైతులు ఆశి స్తున్నారు. వారి ఆశలు నెరవేరాలని ఆశిద్దాం.

Updated Date - 2021-10-18T05:14:49+05:30 IST