చరణ్‌ డ్యూయెల్‌ రోల్‌...శంకర్‌ కండీషన్‌?

Apr 21 2021 @ 12:04PM

మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేయబోతున్నారంటూ వార్తొకటి నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. వివరాల్లోకి వెళితే, రామ్‌చరణ్‌ హీరోగా స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఓ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీవెకంటేశ్వర సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జూన్‌ నుంచి ఈ సినిమా సెట్స్‌ పైకి వెళుతుందని దిల్‌రాజు రీసెంట్‌ ఇంటర్వ్యూలోనూ చెప్పారు. కాగా.. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో తండ్రీ కొడుకు పాత్రలుంటాయి. ఈ రెండు పాత్రల్లో తానే నటిస్తానని శంకర్‌కు చరణ్‌ రిక్వెస్ట్‌ పెట్టాడట. తండ్రి పాత్ర అంటే యాబై ఏళ్లుంటాయి. కాబట్టి చరణ్‌ను ముందు లుక్‌ టెస్ట్‌ చేస్తారు. యాబై ఏళ్ల వ్యక్తి పాత్రకు చరణ్‌ సూట్ అయ్యాడనిపిస్తేనే శంకర్‌, చరణ్‌ రిక్వెస్ట్‌కు ఒప్పుకుంటాడట. లేకపోతే చరణ్‌ తండ్రి పాత్రలో మరో హీరోని తీసుకు రావాలనుకుంటున్నాడట శంకర్ అనే టాల్‌ హల్‌చల్‌ చేస్తోంది. ఈ భారీ బడ్జెట్‌ పాన్‌ ఇండియా మూవీలో రష్మిక మందన్న హీరోయిన్‌గా వార్తలు వినిపిస్తున్నాయి. 

Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.