Nikhat Zareen: నా బాక్సింగ్ గ్లోవ్స్ పై మోదీ ఆటోగ్రాఫ్ తీసుకుంటా...స్వర్ణ పతక విజేత నిఖత్ జరీన్ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-08-08T13:25:49+05:30 IST

ప్రపంచ చాంపియన్‌(world champion), తెలుగు బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌(Nikhat Zareen) కామన్వెల్త్‌ క్రీడల్లో(Commonwealth Games) స్వర్ణం సాధించాక....

Nikhat Zareen: నా బాక్సింగ్ గ్లోవ్స్ పై మోదీ ఆటోగ్రాఫ్ తీసుకుంటా...స్వర్ణ పతక విజేత నిఖత్ జరీన్ వ్యాఖ్యలు

బర్మింగ్‌హామ్: ప్రపంచ చాంపియన్‌(world champion), తెలుగు బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌(Nikhat Zareen) కామన్వెల్త్‌ క్రీడల్లో(Commonwealth Games) స్వర్ణం సాధించాక మన ప్రధానమంత్రి నరేంద్రమోదీని(Prime Minister Narendra Modi) గుర్తు చేసుకున్నారు. ఆదివారం జరిగిన మహిళల 50 కిలోల ఫైనల్లో నిఖత్ జరీన్‌ టైటిల్‌ ఫైట్‌లో 5-0తో కార్లీ మెక్‌నాల్‌ (నార్తర్న్‌ఐలాండ్‌)ను మట్టికరిపించింది. కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకం(gold medallist) సాధించాక(gold medal in the final of the women's 50kg Light Flyweight category) తాను ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిసి బాక్సింగ్ గ్లోవ్స్ పై(Boxing Gloves) ఆటోగ్రాఫ్(PM Modis Autograph) తీసుకుంటానని నిఖత్ జరీన్ సంతోషంగా చెప్పారు.


మూడు రౌండ్లలోనూ కార్లీ మెక్ నాల్ ను ఓడించి  నిఖత్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచారు.‘‘ నేను ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవటానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నాను, గతంలో నేను ప్రధానితో సెల్ఫీ తీసుకున్నాను. నా టీ షర్టుపై ప్రధాని ఆటోగ్రాఫ్ తీసుకున్నాను, ఈ సారి నా బాక్సింగ్ గ్లోవ్స్ తీసుకెళ్లి వాటిపై ప్రధానమంత్రి ఆటోగ్రాఫ్ తీసుకుంటాను’’ అని నిఖత్ జరీన్ చెప్పారు. తాను కామన్ వెల్త్ క్రీడల్లో పతకం గెలుస్తానని ప్రజలు ఊహించారని, తాను 5:0 అద్భుతమైన స్కోర్‌తో స్వర్ణం గెలిచానని చెప్పారు.


‘‘నా దేశం కోసం స్వర్ణం గెలిచినందుకు నేను థ్రిల్‌గా ఉన్నాను. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ల తర్వాత ఇది నా తదుపరి ప్రధాన పోటీ... నేను ఇక్కడ కూడా స్వర్ణం గెలిచాను కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాను’’ అని నిఖత్ వ్యాఖ్యానించారు.స్వర్ణ పతక విజేత మాట్లాడుతూ జాతీయ గీతం ఆలపించినప్పుడు తాను భావోద్వేగానికి గురయ్యానని, రాబోయే ఈవెంట్‌లలో తాను దేశం గర్వపడేలా మంచి ప్రదర్శనను కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.


Updated Date - 2022-08-08T13:25:49+05:30 IST