అక్రమాలు బయటపడేనా?

ABN , First Publish Date - 2021-11-18T06:36:54+05:30 IST

జేటీసీ (జాయింట్‌ ట్రాన్సపోర్ట్‌ కమిషనర్‌) రమాశ్రీ గురువారం జిల్లా పర్యటనకు రానున్నారు. అనంత ఆర్టీఓ కార్యాల యంలో ఆమె తనిఖీలు చేయనున్నారు.

అక్రమాలు బయటపడేనా?

నేడు జిల్లాకు రానున్న జేటీసీ  

అనంత ఆర్టీఓ కార్యాలయంలో తనిఖీలు 

అధికారులు, సిబ్బందిలో గుబులు 

అనంతపురం వ్యవసాయం, నవంబరు 17 : జేటీసీ (జాయింట్‌ ట్రాన్సపోర్ట్‌ కమిషనర్‌) రమాశ్రీ గురువారం జిల్లా పర్యటనకు రానున్నారు. అనంత ఆర్టీఓ కార్యాల యంలో ఆమె తనిఖీలు చేయనున్నారు. కార్యాలయంలో అన్ని రకాల కార్యకలాపాలపై జేటీసీ ఆరా తీయనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆర్టీఓ కార్యాలయ వర్గాలు అప్రమత్తమయ్యాయి. పలు రికార్డులను ముందస్తుగా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. అయినప్పటికీ జేటీసీ తనిఖీల్లో లోపాలు బయటపడితే అంతేనంటూ కొందరు అధి కారులు, సిబ్బందిలో గుబులు రేగుతున్నట్లు సమాచారం. 


నిబంధనల అతిక్రమణలు బయటపడేనా..? 

ఆర్టీఓ కార్యాలయాల్లో  పలు రకాల నిబంధనల అతిక్రమణలు జరుగుతున్నట్లు విమర్శలున్నాయి. ఇటీవల  వాహనాల అక్రమ రిజిస్ర్టేషన వ్యవహారం పెద్ద దుమారమే రేపింది.  కర్ణాటకకు చెందిన ఖరీదైన కార్లు, ఇతర వాహనాలను ఏపీకి తెప్పించి నకిలీ డాక్యుమెంట్లతో అనంత ఆర్టీఓ ఆఫీ్‌సలో రిజిస్ర్టేషన చేయించి, అమాయకులకు అంటగట్టారు. వాహనమిత్రలో వాహన వివరాలు సరి చూసుకోకుండా స్థానిక అధికారులు ఓకే చేయడంతో అమాయకులైన వాహనదారులు బలయ్యారు. అనంతలో అక్రమంగా రిజిస్ర్టేషన చేసి విక్రయించిన దాదాపు 50  వాహనాలను ఈ ఏడాది మార్చిలో కర్ణాటక పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రిజిస్ర్టేషన వ్యవహారంలో అరెస్టయిన ఏజెంట్లు తిరిగి అనంత నగరంలో ఆర్టీఓ కా ర్యాలయం అనుమతి లేకుండానే ఆర్టీఓ ఆనలైన సెంటర్ల ను నడుపుతున్నట్లు సమాచారం. మరికొందరు ఆర్టీఓ అధికారుల అనుమతి లేకుండానే కొన్నేళ్లుగా ఆర్టీఓ ఆనలైన సెంటర్లను నడుపుతున్నారు. ఇదంతా తెలిసినా ఆర్టీఓ అధికారులు తమకేమిపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 


ఇన్సూరెన్సలో మాయాజాలం

వాహనాల ఎఫ్‌సీ, ట్రాన్సఫర్‌ ఆఫ్‌ ఓనర్‌షిప్‌, పర్మిట్లు, ఫైనాన్స కార్యకలాపాలు, తదితర పనులకు వాహనాల ఇన్సూరెన్స తప్పని సరిగా సమర్పించాలి. కొందరు ఏజెంట్లు ట్రాన్సపోర్ట్‌, నానట్రాన్స పోర్టు వాహనాలకు సంబంధించి ఆనలైన మాయాజాలంతో నకిలీ ఇన్సూరెన్స పత్రాలను సృష్టించి పనులు కానిచ్చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఫోర్‌ వీలర్‌ వాహనాల రిజిస్ర్టేషన నెంబర్లు, చాషీ నెంబర్‌లను ద్విచక్రవాహనాల నెంబర్లుగా ఆనలైనలో ఇన్సూరెన్స కంపెనీలకు సమర్పించి అతి తక్కువ ఇన్సూరెన్స మొత్తంతో రెన్యూవల్‌ చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఫోర్‌ వీలర్లకు వాహనాల రకాన్ని బట్టి రూ.వేలల్లోనే ఇన్సూరెన్స డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఫోర్‌వీలర్‌ వాహనాల నెంబర్లు, చాషీ నెంబర్లు ద్విచక్రవాహనానికి సంబంధించినవిగా ఆనలైనలో నమోదు చేసి కేవలం రూ.1000, రూ.1200లతోనే ఇన్సూరెన్స రెన్యువల్‌ చేస్తున్నట్లు తెలిసింది. ఆర్టీఓ కార్యాలయంలోని వాహన మిత్రలో ఇన్సూరెన్స అప్‌డేట్‌లో ఉన్న బండి నెంబర్‌, చాషీ నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి. ఎంత మొత్తం డబ్బులు చెల్లించా రన్న వివరాలు ఉండవు. ఆ వివరాలు కేవలం ఇన్సూరెన్స కంపెనీల వద్దే ఉంటాయి. ఇక్కడే కొందరు ఆర్టీఓ ఆనలైన సెంటర్‌ ఏజెంట్లు తమ అక్రమ మార్గాలకు తెరలేపారు. ఆనలైన ఇన్సూరెన్స ఏజెంట్లతో ఆర్టీఓ ఆనలైన సెంటర్ల ఏజెంట్లు కుమ్మకై నిబంధనలకు విరుద్ధంగా ఆర్టీఓ ఆఫీస్‌ లో పనులు చేయిస్తూ భారీగానే ‘సొమ్ము’ చేసుకుంటున్న ట్లు సమాచారం. వాహనమిత్రలో వాహనం ఇన్సూరెన్స అప్‌డేట్‌లో ఉందని మాత్రమే ఆర్టీఓ అధికారులు చూస్తు న్నారు. మాన్యువల్‌గా ఒరిజనల్‌ ఇన్సూరెన్స సమర్పించే సమయంలో రూ.1000లకు బదులుగా ఆయా వాహనాల కు చెల్లించాల్సిన  ఇన్సూరెన్స డబ్బులనే కట్టినట్లు నకిలీ ఇన్సూరెన్స పత్రాలను సమర్పిస్తున్నట్లు తెలిసింది. వాస్తవ విషయాలను గమనించకుండా కొందరు ఆర్టీఓ అధికా రులు ఓకే చేస్తున్నట్లు సమాచారం. కొందరు అధికారులు ఆమ్యామ్యాలు పుచ్చుకోవడంతోనే ఈ వ్యవహారాలు తెలిసి నా పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. మరోవైపు జిల్లాలో వాహనదారులకు కొత్త డ్రైవింగ్‌ లైసెన్స, ఆర్‌సీ కార్డుల జారీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో తర చూ ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ బాధితులు ప్రదక్షిణలు చేస్తున్నారు. జేటీసీ తనిఖీల్లో నిబంధనల అతిక్రమణలు బయటపడకుండా కొందరు అధికారులు, సిబ్బంది జాగ్రత్త లు తీసుకున్నట్లు తెలిసింది. లోతుగా తనిఖీలు చేస్తే ఆర్టీఓ కార్యాలయాల్లో జరిగే నిబంధనల అతిక్రమణలు బయటపడే అవకాశం ఉంది.  

Updated Date - 2021-11-18T06:36:54+05:30 IST