ప్రజాక్షేత్రంలో మంత్రి అవినీతిని బయటపెడతా

ABN , First Publish Date - 2022-05-15T06:33:36+05:30 IST

అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అవినీతి భాగోతం జిల్లాలో రోజురోజుకూ మితిమీరుతుందని, ఆయన అవినీతిని ప్రజా క్షేత్రంలో బయట పెడతానని అందుకే గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నానని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రక టించారు.

ప్రజాక్షేత్రంలో మంత్రి అవినీతిని బయటపెడతా
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మహేశ్వర్‌రెడ్డి

అవినీతికి మారుపేరు అల్లోల 

మూడేళ్ల నుండి ఒక్క పెన్షన్‌ ఇచ్చారా..? 

మంత్రి ఐకే రెడ్డిపై ఏలేటి ధ్వజం

నిర్మల్‌ కల్చరల్‌, మే 14 : అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అవినీతి భాగోతం జిల్లాలో రోజురోజుకూ మితిమీరుతుందని, ఆయన అవినీతిని ప్రజా క్షేత్రంలో బయట పెడతానని అందుకే గ్రామాల్లో పాదయాత్ర చేస్తున్నానని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ప్రక టించారు. శనివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. గత మూడేళ్లుగా ఏ ఒక్కరికైనా పెన్షన్‌ మంజూరు చేశారా అని ప్రశ్నించారు. హైలెవల్‌ కెనాల్‌లో వందల కోట్ల అక్రమాలు జరి గాయని, అనుభవం లేని కాంట్రాక్టర్‌కు పనులు ఇచ్చి నిధులు ఎక్కువగా మంజూరు చేశారన్నారు. దాని పూర్తి ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ తనవద్ద ఉందని హై కోర్టుకు వెళ్లైనా అవినీతి నిరూపిస్తానన్నారు. ప్రజల కోసం పోరాడే పార్టీ కాం గ్రెస్‌ అని మాట ఇస్తే తప్పమని స్పష్టం చేశారు. ముప్పై కోట్ల విలువైన అట వీభూమి మంత్రి బంధువుల స్వాహా చేశారని ఆరోపించారు. ఆ విషయం బహిర్గంతం చేస్తే డీఎఫ్‌వోను బదిలీ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అడవులను కాపాడాలని మంత్రి పదవి ఇస్తే అడవులను మాయం చేయడం ఏమిటన్నారు. వెంకటాపూర్‌లో కోట్లు విలువ చేసే అసైన్డ్‌ భూమి స్వాహా చేశారని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అవినీతి నిర్మల్‌ లోనే ఉందన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్‌ పార్టీ బ్యానర్ల ఏర్పాటు అన్నదానాలను సైతం చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, ఇది మంత్రి హోదాకు తగదని హితవు పలికారు. ఈ సమావేశంలో నాయకులు తక్కల రమణారెడ్డి, సత్యం చంద్రకాంత్‌, నాందేడపు చిన్ను, జునైద్‌, సంతోష్‌, అయ్యన్నగారి పోశెట్టి, మౌర్య, డి.ముత్యంరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-15T06:33:36+05:30 IST