ఆక్రమణల అంతు తేల్చరేం?

ABN , First Publish Date - 2021-07-23T04:02:48+05:30 IST

పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లు తయారైంది వనపర్తి మునిసిపాలిటీ పరిస్థితి.

ఆక్రమణల అంతు తేల్చరేం?
గతేడాది వరదలకు మునిగిన శ్వేతానగర్‌ కాలనీ (ఫైల్‌)

- తాళ్ల చెరువు, మర్రికుంట చెరువు వాగుపై అక్రమ నిర్మాణాలు

- గతేడాది వరద ముంపునకు గురైన వనపర్తి ప్రజలు

- ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో కాలనీలకు మళ్లీ వరద ముప్పు

- అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కమిటీ వేసి.. గాలికొదిలేశారు..

- ఏడాదిగా 11 అక్రమ నిర్మాణాల గుర్తింపు

- సంవత్సరమైనా పూర్తి కాని వంతెనల నిర్మాణాలు


వనపర్తి, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : పేరు గొప్ప.. ఊరు దిబ్బ అన్నట్లు తయారైంది వనపర్తి మునిసిపాలిటీ పరిస్థితి. ఏ పని ప్రారంభించినా చివరి వరకు కొనసాగించకపోవడం, పాలకవర్గ సభ్యులు, అధికారుల మధ్య సమ న్వయ లేమి కారణంగా కొన్ని పనులు, ఏర్పాటు చేసిన కమిటీలు కాగితా లకే పరిమితమవుతున్నాయి.

జిల్లా కేంద్రంలో తాళ్ల చెరువు, నల్ల చెరువు, ఈదుల చెరువులు ప్రధా నంగా ఉన్నాయి. వీటిల్లో ఈదుల చెరువు నుంచి వచ్చే వరద తాళ్ల చెరువు కు వస్తుంది. చెరువు చుట్టూ ఆక్రమణలు ఉండటం, చెరువు నుంచి కింద కు అలుగు వెళ్లే ప్రాంతమంతా కబ్జా గురవడంతో వాగు ఇరుకుగా మారిం ది. దీంతో గతేడాది కురిసిన భారీ వర్షాలకు శ్వేతానగర్‌, రామాటాకీస్‌, బా లుర కళాశాల, రాయిగడ్డ, రాంనగర్‌కాలనీ, బ్రహ్మంగారి వీధి, ర్యాంకర్‌ స్కూల్‌ ప్రాంత మొత్తం నీటి మునిగింది. హైదరాబాద్‌కు వెళ్లే ప్రధాన రో డ్డు దెబ్బతిని, రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఒక్క శ్వేతానగర్‌ కాల నీలోనే 75 ఇళ్లు మునిగాయి. బాలుర కళాశాల పాత భవనం కిటికీల్లో నుం చి నీరు పారాయి. అయితే, మునిసిపల్‌ అధికారులు 11 నిర్మాణాలు అక్ర మంగా ఉన్నట్లు గుర్తించారు. ఇందులో రెండింటిని తొలగించినట్లు పే ర్కొంటున్నారు. తాళ్ల చెరువు అలుగు నుంచి అమ్మ చెరువు వరకు వంద కుపైగా అక్రమ నిర్మాణాలు ఉంటాయి. కానీ, వాటిని ఓ ఫీల్డ్‌ సర్వే చేసి, ని ర్ధారించడానికి ఏడాది కాలం నుంచి కమిటీకి సమయం తీరడం లేదు. అ లాగే మర్రికుంట వాగుపై దాదాపు 20 వరకు అక్రమ నిర్మాణాలు ఉన్నా యి. పలువురు పెద్దపెద్ద ప్రహరీలు వాగులను ఆక్రమించుకుని నిర్మించా రు. అసలు ఆ కాలువ ఉనికే కనుమరుగయ్యే పరిస్థితులు ఉన్నాయి. ప్ర స్తుతం అక్కడ కొత్త కాలనీలు ఏర్పాటవుతున్నందున భవిష్యత్‌లో వాటికి వరద ముప్పు లేకుండా కాలువను తవ్వి, పెద్ద నాలా లాగా లైనింగ్‌తో ఏ ర్పాటు చేయాలనే డిమాండ్‌ ఉంది.


ఏ పనీ చేయలే..

గతేడాది తాళ్ల చెరువు వాగుపై గుర్తించిన 11 అక్రమ నిర్మాణాలను కూ ల్చి వేతకు టెండర్‌ పిలిచారు. ఇప్పటి వరకు కూల్చివేతలు పూర్తి కాలేదు. వాగు వెడల్పు చేయడంతో పాటు షిల్ట్‌ తొలగించాలని గతంలో తీర్మానిం చారు. ఇప్పటివరకు వాటి విషయంలో అడుగు ముందుకు పడలేదు. ఏ డాది కిందట తాళ్ల చెరువు వాగుపై రెండు చిన్న బ్రిడ్జిలు ఒక్కొక్కటీ రూ.50 లక్షల చొప్పన కేటాయించి, ప్రారంభించారు. కానీ, ఇప్పటి వరకు ఆ పను లు పూర్తి కాలేదు. రామటాకీస్‌ వద్ద హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ.2.50 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. మార్కింగ్‌ కూడా కాలేదు. హైదరాబా ద్‌ దారిలో జేరిపోతుల మైసమ్మ వాగు వద్ద హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరయ్యాయి. గతేడాది ఇక్కడ వరద ఉధృతికి ఇద్దరు గ ల్లంతయినా, నేటికీ అసలు టెండర్‌ కూడా పిలవలేదు. కేవలం కాగితాల వ రకే పనులు పరిమితమయ్యాయి. అలాగే ఖిల్లాఘణపురం దారిలో నల్లచె రువు అలుగు పారే బ్రిడ్జికి రూ.5.65 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం అక్క డ రోడ్డు విస్తరణ పనులు నడుస్తున్నాయి. కానీ, బ్రిడ్జికి సంబంధించిన ప నులు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. వరద వచ్చినప్పుడు హడావిడి చేసిన అధికారులు ఇప్పటివరకు మంజూరైన పనులు చేయడానికి చర్యలు తీసుకోకపోవడం, ఆక్రమణలను గర్తించి తొలగించకపోవడంతో వరద ము ప్పును ప్రజలు మరోసారి ఎదుర్కొకక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.


నిర్లక్ష్యానికి నిలువుటద్దం

గతేడాది రికార్డు స్థాయిలో వర్షం కురవడంతో పట్టణంలో నాలాలు ఉ ప్పొంగాయి. చెరువులు అలుగులు పారడంతో వాగులు ఉగ్రరూపం దాల్చా యి. నాలాలు, వాగుల వెంట ఉన్న కాలనీలు, అక్రమ నిర్మాణాలు నీట మునిగాయి. ఈ అక్రమ నిర్మాణాలు, నాలాల ఆక్రమణలు మొదటిసారి తె రపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అక్రమ నిర్మాణాల గుర్తింపు, తొలగింపు, నాలాల ఆక్రమణలను గుర్తించి తొలగించడానికి మునిసిపాలిటీ ఆధ్వర్యం లో కమిటీ వేశారు. రెవెన్యూ, పోలీసు, పంచాయతీ రాజ్‌, ఆగ్నిమాపక శాఖ, మునిసిపాలిటీ, ఆర్‌అండ్‌బీ అధికారులను ఈ కమిటీల్లో సభ్యులుగా ని యమించారు. నిర్ణీత గడువులో కమిటీ అక్రమ నిర్మాణాలను గుర్తించి, తొల గిస్తే ఈ ఏడాది వరద ముప్పును తప్పించేవారు. అయితే, నేటికీ ఈ కమిటీ పేపర్లపై ఏర్పడమే కానీ, అక్రమ నిర్మాణాల నిగ్గు తేల్చింది లేదు.

Updated Date - 2021-07-23T04:02:48+05:30 IST