వంటనూనె ధర తగ్గనుందా..!

ABN , First Publish Date - 2022-05-24T00:23:32+05:30 IST

పామాయిల్ ఎగుమతులపై నిషేధం ప్రకటించిన దాదాపు నెల రోజుల తర్వాత, ఇండోనేషియా ప్రభుత్వం ఈ రోజు(సోమవారం... మే 23) నుండి అమలులోకి వచ్చేలా పరిమితిని ఎత్తివేసింది.

వంటనూనె ధర తగ్గనుందా..!

హైదరాబాద్ : పామాయిల్ ఎగుమతులపై నిషేధం ప్రకటించిన దాదాపు నెల రోజుల తర్వాత, ఇండోనేషియా ప్రభుత్వం ఈ రోజు(సోమవారం... మే 23) నుండి అమలులోకి వచ్చేలా పరిమితిని ఎత్తివేసింది. ప్రపంచవ్యాప్తంగా పామాయిల్ సరఫరాలో 50 శాతానికి పైగా వాటా ఈ  ఆగ్నేయాసియా దేశానినదే. పెరిగిన సరఫరా నేపథ్యంలో భారతదేశంలో ఎడిబుల్ ఆయిల్ ధరలను ఈ చర్య చల్లబరుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆగ్నేయాసియా దేశంలో తీవ్ర కొరత సహఆ ఆకాశాన్నంటుతున్న ఆహార చమురు ధరల నేపథ్యంలో ఇండోనేషియా కిందటి నెలలో(ఏప్రిల్ 28 నుండి) పామాయిల్ ఎగుమతిపై నిషేధాన్ని ప్రకటించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచ వంటనూనె సరఫరా భారీ సరఫరా లోటులో ఉంది. అంతేకాకుండా... పామ్ మరియు సోయా నూనెల ధరలు రికార్డు స్థాయికి చేరాయి. మొతీ్తంమీద ఈ తాజా పరిణామాల నేపథ్యంలో వంటనూనెల ధరలు తగ్గనున్నట్లుగానే వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. 

Updated Date - 2022-05-24T00:23:32+05:30 IST