స్పెషాలిటీ స్టీల్... PLI స్కీమ్‌కు కేవలం పది దరఖాస్తులు

ABN , First Publish Date - 2022-05-22T21:22:25+05:30 IST

స్పెషాలిటీ స్టీల్ కు సంబంధించి... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న PLI స్కీమ్‌కు కేవలం పది మాత్రమే దరఖాస్తులు వచ్చాయి,

స్పెషాలిటీ స్టీల్...  PLI స్కీమ్‌కు కేవలం పది దరఖాస్తులు

మూడవసారి గడువును పొడిగించనున్నారా ?

న్యూఢిల్లీ : స్పెషాలిటీ స్టీల్ కు సంబంధించి... ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న PLI స్కీమ్‌కు కేవలం పది మాత్రమే దరఖాస్తులు వచ్చాయి, ఉక్కు తయారీదారులు కొన్ని అబ్యంతరాలు, ఆందోళనలను వ్యక్తం చేసిన నేపథ్యంలో... ఈ పథకం కింద వడ్డీని చెల్లించేందుకుగాను చివరి తేదీని ఇప్పటికే రెండుసార్లు పొడిగించిన ప్రభుత్వం... మరోమారు పొడిగించాలని భావిస్తున్నట్లు సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొంటున్నారు. ప్రారంభంలో, స్పెషాలిటీ స్టీల్ కోసం PLI (ప్రొడక్షన్-లింక్డ్ ఇన్సెంటివ్) పథకం కింద ప్రయోజనాల కోసం తయారీదారులు దరఖాస్తు చేసుకోవడానికి మొదట మార్చి 29 చివరి తేదీ కాగా, దీనిని ఆ తరువాత ఏప్రిల్ 30, మళ్లీ మే 31 వరకు పొడిగించారు. చివరి తేదీని మళ్లీ పొడిగించడానికి సంబంధించి మాట్లాడుతూ... ‘ఇంకా పూర్తి నిర్ణయం జరగలేదు’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ఉక్కు తయారీదారులు ముందుగా ఈ పథకంపై ఆందోళనలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.


ఈ క్రమంలో... ప్రభుత్వం స్పెషాలిటీ స్టీల్ కోసం PLI పథకంలో కొన్ని సవరణలు చేయడానికి ప్రక్రియను ప్రారంభించింది. ఈ క్రమంలో... సవరించిన పథకంలో, ప్రత్యేక ఉక్కు ఉత్పత్తిపై ప్రభుత్వం ఏకరీతి ప్రోత్సాహకంపై కసరత్తు చేస్తోంది. ప్రత్యేకించి రక్షణరంగంలో ఉపయోగించే మరిన్ని గ్రేడ్‌లు ఈ పథకంలో చేర్చారు. ద్వితీయ శ్రేణి క్రీడాకారులళ్లకు... కనీస పెట్టుబడిపై పరిమితిని, కనీస సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం కూడా తొలగించనున్నట్లు పేర్కొన్నారు. గతేడాది జూలై 22 న, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం... స్పెషాలిటీ స్టీల్ ఉత్పత్తిని పెంచడానికి రూ. 6,322 కోట్ల PLI పథకాన్ని ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో... దాదాపు రూ. 40 వేల కోట్ల అదనపు పెట్టుబడులను సమకూరతాయని, 5.25 లక్షల ఉద్యోగావకాశాలు తెరమీదకొస్తాయని కేంద్రం భావించింది. 

Updated Date - 2022-05-22T21:22:25+05:30 IST