కొత్త చట్టంతోనైనా కష్టాలు తీరేనా?

ABN , First Publish Date - 2020-09-12T10:09:57+05:30 IST

ఉమ్మడి జిల్లా పరిధిలో భూప్రక్షాళన జరిగినా.. భూ సమస్యలు మాత్రం తగ్గలేదు.

కొత్త చట్టంతోనైనా కష్టాలు తీరేనా?

ఉమ్మడి జిల్లాలో నేటికీ పరిష్కారం కాని భూ సమస్యలు 

ప్రక్షాళన పూర్తయినా ఫలితం శూన్యమే

నేటికీ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు


నిజామాబాద్‌, సెప్టెంబరు 11  (ఆంధ్రజ్యోతి ప్రతినిధి):  ఉమ్మడి జిల్లా పరిధిలో భూప్రక్షాళన జరిగినా.. భూ సమస్యలు మాత్రం తగ్గలేదు. భూముల చిట్టా అంతా ఇంకా అసమగ్రంగానే ఉంది. నైజాం కాలంలోని భూ రికార్డులు కావడంతో రికార్డులో ఉన్న విస్తీర్ణానికి కాస్తు లో ఉన్న విస్తీర్ణానికి భారీ తేడాలు ఉన్నాయి. గ్రామాల లో ఏళ్ల తరబడి భూ సరిహద్దుల పంచాయతీలు కొన సాగుతున్నాయి. అవసరం మేరకు అమ్మకాలు జరిగిన ప్పుడు సర్వేలు చేస్తే భారీ తేడాలు వస్తున్నాయి. గ్రా మాలలో గొడవలకు కారణాలు అవుతున్నాయి.


భూ ప్ర క్షాళనతో ఉమ్మడి జిల్లాలో భూముల సమస్యలు కొంత పరిష్కారం అయినా విస్తీర్ణం గొడవలు సద్దుమనగలే దు. ఉమ్మడి రాష్ట్రంలో భూభారతి పేరుతో జిల్లాలో భూ ముల సమగ్ర సర్వే చేపట్టినా.. అది పూర్తికాలేదు. ప్ర స్తుతం ప్రభుత్వం మళ్లీ సర్వే చేస్తామని ప్రకటిస్తున్నా తగినంత సిబ్బంది మాత్రం జిల్లాలో లేరు. రాష్ట్ర ప్రభు త్వం భూ సమస్యలు లేకుండా ఉండేందుకు కొత్త రెవె న్యూ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం త్వరలో అమ లులోకి వస్తుంది. కొత్త చట్టం అమ లయ్యేంతవరకు భూముల రిజిస్ట్రేషన్‌లను ప్రభుత్వం నిలిపి వేసింది. గ్రామాలలో భూ సమస్య లు రాకుండా ఉండేందుకు 


భూ ముల సమగ్ర సర్వే చేస్తామని ప్రభు త్వం ప్రకటన లు చేసింది. భవిష్య త్తులో భూములకు సంబంధించి న సమస్యలు రాకుండా సమ గ్ర భూసర్వే ఉపయోగపడు తుందని ప్రకటన చేసింది. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టి న భూప్రక్షాళన వల్ల భూ ములకు సంబంధించిన చాలా సమస్యలు పరిష్కార మయ్యాయి. రైతుల వారీగా వివ రాలు సేకరించడంతో కాస్తులో ఉన్న వారందరికీ పట్టా లు ఇచ్చారు. వివాదాస్పద భూములకు మాత్రం ఇప్పటికీ ఇంకా పట్టాలు రాలేదు. 


నేటికీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న రైతులు

ఉమ్మడి జిల్లా పరిధిలో పట్టాలు వచ్చినా.. తమ భూ ములలో తేడాలు ఉన్నాయని నేటికీ రెవెన్యూ కార్యాల యాల చుట్టూ రైతులు తిరుగుతూనే ఉన్నారు. నైజాం కాలంలో 1936 నుంచి 1941 మధ్య సమగ్ర భూముల సర్వే జరిగింది. ఆ తర్వాత ఏ ప్రభుత్వం కూడా భూ ముల సర్వే చేపట్టలేదు. భూముల అమ్మకాలు, కొనుగోలు జరిగిన సమయంలో పట్టాలు ఇచ్చారు.


నైజాం కాలం ఉన్న విధంగా కాకుండా ప్రస్తుతం భూములన్నీ స న్న, చిన్నకారు చేతులలో ఉన్నాయి. అన్ని చిన్న కమతాలే ఉన్నాయి. ఎకరం నుంచి ఐదెకరాల లోపు రైతులే ఎక్కువగా ఉన్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఇలాంటి రైతులే ఎక్కు వగా ఉన్నారు. భూ ప్రక్షాళన ద్వారా ఈ రైతులకు పట్టాలు వచ్చిన సమస్యలు మాత్రం తగ్గలేదు. కాస్తులో ఉన్న భూములకు విస్తీర్ణంకు తేడాలు ఉన్నాయి. భూముల సర్వే నెంబర్ల ప్రకారం రైతులకు పట్టాలు ఇచ్చారు. పహణీలలో వివరాలు పొందుపరిచారు. భూప్రక్షాళన తర్వాత ధరణి వెబ్‌సైట్‌లో పొందుప రిచారు.


చాలా మంది రైతులకు సర్వే నెంబర్లలో ఉన్న విధం గా భూవిస్తీర్ణం లేదు. కొంత మందికి ఎక్కవగా ఉండగా మరికొంత మంది రైతుల కు తక్కువగా ఉంది. కా స్తులో విస్తీర్ణం కాకుండా సర్వే నెంబర్‌ ఆధారంగా ఈ పట్టాలు భూ ప్రక్షాళన సమయంలో రైతులకు ఇచ్చా రు. పట్టాలు ఉండటం వల్ల కొన్ని చోట్ల రైతులు గొడవలు పడుతుప్నా అవి ఇంకా సద్దుమణగలేదు. 


ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన భూముల సర్వే

ఉమ్మడి రాష్ట్రంలోనే జిల్లా పరిధిలో భూ భారతి ద్వా రా భూముల సమగ్ర సర్వే చేశారు. ఉమ్మడి జిల్లా పరి ధిలోని 911 గ్రామాలలో సర్వే నిర్వహించారు. పైలట్‌ ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ భూభారతి కింద ప్రతీ గ్రా మంలో శాటిలైట్‌ ద్వారా భూముల సర్వే చేశారు. భూ ములకు సంబంధించిన ఫొటోలు తీశారు. గ్రామాల వా రీగా ఫొటోలు వేరు చేశారు. సర్వే నెంబర్‌ ఆధారంగా ఎల్‌పీఎంలను సిద్ధ్దం చేశారు. ఉమ్మడి జిల్లాలో 345 గ్రామాలలో రికార్డులను సిద్ధం చేశారు. భూభారతి ద్వా రా ప్రైవేటు ఏజెన్సీ ద్వారా సర్వే చేయగా సర్వే అండ్‌ ల్యాండ్‌ అధికారులు పర్యవేక్షించారు. భూభారతి కింద చేసిన సర్వే మ్యాపులను రెవెన్యూ రికార్డులతో అనుసం ధానం చేస్తే సమగ్ర భూముల వివరాలు వచ్చేవి. రాష్ట్ర విభజన తర్వాత భూభారతిని పట్టించుకోలేదు. కార్యాల యం కూడా ఎత్తివేశారు.


కొత్తగా మళ్లీ భూసర్వే

 రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా సమగ్ర భూసర్వే చేపడతా మని ప్రకటించింది. గ్రామాల వారీగా ఈ సర్వే చేస్తా మని తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలో భూభారతి ద్వారా చేపట్టిన వివరాలు ఉన్నాయి. సర్వే మ్యాపులు ఉ న్నాయి. శాటిలైట్‌ భూ చిత్రాలు ఉన్నాయి. వీటిని ఉపయోగిస్తే ఉమ్మడి నిజా మాబాద్‌ జిల్లా పరిధిలో సర్వే సులభతరం కానుంది. భూభారతి సర్వేసమయంలో రెవెన్యూ సిబ్బంది లేకపోవడం వల్ల కొన్ని గ్రామాల పరిధిలో విస్తీర్ణంలో తేడాలు ఉన్నాయి. సర్వే సమయంలో చుట్టుపక్కల ఉన్న పట్టాదారులను ఉంచి తే అక్కడే సమస్య పరిష్కారం అయ్యేది. పట్టించుకోక పోవడం కొన్ని చోట్ల రెవెన్యూ అధికారులను పిలవక పోవడం వల్ల సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరి స్తూ సర్వే నిర్వహిస్తే రైతులకు ఉపయోగపడనుంది.


వేధిస్తున్న సిబ్బంది కొరత

రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర భూసర్వే చేపట్టినా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలో ప్రస్తుతం సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. సర్వేయర్లతో పాటు ఇతర సిబ్బంది తక్కువగా ఉన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో 29 మండ లాలకు గాను 5 మండలాలలో సర్వేయర్లు లేరు. అన్ని మండలాల పరిధిలో ఇతర సిబ్బంది కొరత ఉంది. ప్ర స్తుతం వీఆర్‌వోల వ్యవస్థను ఎత్తివేయడం వల్ల ఇంకా కొరత ఎక్కువయ్యింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంను మా త్రం రెవెన్యూ అధికారులు స్వాగతిస్తున్నారు. సమగ్ర భూ సర్వే చేస్తే రైతులకు మేలు జరుగుతుందని వారు తెలిపారు. గ్రామాలలో సర్వే చేసేటప్పుడు చుట్టు ఉన్న పట్టాదారులను ఉంచితేనే సమగ్ర వివరాలు వస్తాయని తెలిపారు. వారిని పిలవకుండా సర్వే నెంబర్ల వారీగా చేస్తే సమస్యలు తగ్గవని తెలిపారు. 

Updated Date - 2020-09-12T10:09:57+05:30 IST