వరి వద్దనే సీఎంలు ఉంటారా?

ABN , First Publish Date - 2022-08-19T05:11:03+05:30 IST

రైతులు వరి వేసుకుంటే ఊరే అని, కౌలు రైతులను రైతులే కాదన్నా సన్నాసి సీఎం మన కేసీఆర్‌ అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు.

వరి వద్దనే సీఎంలు ఉంటారా?
ఊట్కూర్‌ నుంచి కొల్లూర్‌కు పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ షర్మిల

- ఎనిమిదేంళ్లుగా కేసీఆర్‌ ఆడిందే ఆట- పాడిందే పాట 

-  ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్కహామీ అమలు చేయని సీఎం 

-  ఓట్లు దండుకునేందుకే పథకాలు

-  వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

ఊట్కూర్‌ ఆగస్టు 18 : రైతులు వరి వేసుకుంటే ఊరే అని, కౌలు రైతులను రైతులే కాదన్నా సన్నాసి సీఎం మన కేసీఆర్‌ అని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. గురువారం ప్రజా ప్రస్థానం పాదయాత్ర 125వ రోజు మండలంలోని లక్ష్మీపల్లిలో ప్రారంభించిన పాదయాత్ర మధ్యాహ్నం  ఊట్కూర్‌ గ్రామానికి చేరుకున్నది. దారిపొడవున రైతులతో మాట్లాడి వారి సమ స్యలను తెలుసుకున్నారు. ఊట్కూర్‌ అంబేడ్కర్‌ సర్కిల్‌లో పెద్దపొర్ల గ్రామాల్లో ఆమె మాట్లాడా రు. ఎనిమిదేండ్లుగా రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలన ఆడిందే ఆటా.. పాడిందే పాటగా కొనసాగుతున్నదని ఆరోపించారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తా అన్నారు. 57 సంవత్సరాలు నిండిన వారికి పెన్షన్లు అన్నారు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ అన్నారు. కానీ ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు. ప్రత్యేక తెలంగాణలో కౌలు రైతులు, రైతు కూలీలు అప్పుల పాలయ్యారని విమర్శించారు. నిత్యావసర సరకుల ధరలు, బస్సు చార్జీలు పెరిగినా ఆసరా పెన్షన్‌ మాత్రం పెంచడం లేదన్నారు. ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని  ప్రతిపక్షాలు కూడా సీఎంను ప్రశ్నించడం లేదన్నారు. కేసీఆర్‌ పాలనలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కాదు,  బార్ల తెలంగాణగా మారిందన్నారు. రుణమాఫీ చేయకపోవడంతో రైతులు బ్యాంకులో తీసుకున్న ఋణాలు కట్టలేక.. కొత్త రుణాలు పుట్టక వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పులపాలవుతున్నారని ఆరోపించారు.  ఎన్నికలు వస్తే చాలు ఓట్ల కోసం కేసీఆర్‌  గాడిదకు రంగు వేసి ఆవు అని గారడి చేస్తాడని ఆరో పించారు.  రైతుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఒక్క వైఎస్సార్‌టీపీ మాత్రమే పోరాటం చేస్తున్నదని అన్నారు.  ఊట్కూర్‌లో 69జీవో అమలుపై రైతులు వినతి పత్రం ఇచ్చారు.  కార్యక్రమంలో వైఎస్సార్‌టీపీ  రాష్ట్ర అధికార ప్రతినిధి పిట్టం రాంరెడ్డి, రాష్ట్ర ప్రచార కమిటీ అధ్యక్షుడు  నీలం రమేష్‌, నియోజకవర్గ పరిశీలకుడు బొజ్జం అనిల్‌కుమార్‌, రవిప్రకాష్‌, మహిళ నాయకురాలు చైతన్య రెడ్డి, మక్తల్‌ నియోజవర్గ ఇన్‌చార్జి గంగాధర్‌, నిడుగుర్తి గ్రామ నాయకులు పాల్గొన్నారు.





Updated Date - 2022-08-19T05:11:03+05:30 IST