Share Marketలోకి మరో బయోటెక్ ఐపీఓ

ABN , First Publish Date - 2021-07-30T07:35:00+05:30 IST

షేర్ మార్కెట్‌లోకి మరో బయోటెక్ సంస్థ అడుగుపెట్టబోతోంది. వచ్చే నెలలో ఈ సంస్థ షేర్ మార్కెట్లో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)గా..

Share Marketలోకి మరో బయోటెక్ ఐపీఓ

షేర్ మార్కెట్‌లోకి మరో బయోటెక్ సంస్థ అడుగుపెట్టబోతోంది. వచ్చే నెలలో ఈ సంస్థ షేర్ మార్కెట్లో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్)గా నమోదుకానుంది. ఫార్మాస్యూటికల్స్ ఫార్ములేషన్స్ తయారు చేసే విందాల్స్ బయోటెక్ దాదాపు రూ.401 కోట్ల ఐపీఓగా షేర్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. ఒక్కో షేర్ ధర దాదాపు రూ.448 నుంచి రూ.460 వరకు ఉంటుందని సంస్థ తెలిపింది. ఆగస్టు 4వ తేదీ నుంచి తమ ఐపీఓ ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. రెండు రోజుల వ్యవధిలో ఐపీఓ పూర్తి చేసుకుని ఆగస్టు 6 నుంచి పూర్తి స్థాయిలో మార్కెట్లో అడుగుపెట్టనుంది. ఇదిలా ఉంటే ఈక్విటీ రూపంలో మళ్లీ కొత్తగా 51,42,067 షేర్లను విడుదల చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. వీటి విలువ రూ.165 కోట్ల వరకు ఉంటుందని తెలిపింది.

Updated Date - 2021-07-30T07:35:00+05:30 IST