
అహ్మదాబాద్: భారత జట్టు నిర్దేశించిన 266 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన వెస్టిండీస్ జట్టు భారత బౌలర్ల దెబ్బకు విలవిల్లాడుతోంది. 25 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. షాయ్ హోప్ (5), బ్రెండన్ కింగ్ (14), షమర్హ్ బ్రూక్స్ (0) దారుణంగా విఫలమయ్యారు. అయితే, డారెన్ బ్రావో, కెప్టెన్ నికోలస్ పూరన్ క్రీజులో కుదురుకోవడంతో వికెట్ల పతనానికి అడ్డుకట్ట పడినట్టు కనిపించింది.
ఇద్దరూ కలిసి సంయమనంతో ఆడుతూ జట్టును ఒడ్డున పడేసే ప్రయత్నం చేశారు. అయితే, ఈసారి ప్రసిద్ధ్ కృష్ణన్ విండీస్‌ను దెబ్బకొట్టాడు. బ్యాట్ ఝళిపించేందుకు సిద్ధమవుతున్న బ్రావో (20)ను వెనక్కి పంపాడు. దీంతో విండీస్ జట్టు మరోమారు కష్టాల్లో పడింది.
ప్రస్తుతం 14 ఓవర్లు ముగిశాయి. విండీస్ నాలుగు వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ (28), జాసన్ హోల్డర్ (1) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో దీపక్ చాహర్ 2 వికెట్లు పడగొట్టగా, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణన్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి