28న మద్యం దుకాణాలు బంద్‌

ABN , First Publish Date - 2021-04-24T04:52:48+05:30 IST

ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 28న మద్యం షాపుల బంద్‌ చేస్తున్నారు.

28న మద్యం దుకాణాలు బంద్‌

వీరవాసరం/భీమవరం అర్బన్‌, ఏప్రిల్‌ 28 : ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 28న మద్యం షాపుల బంద్‌ చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్‌, ఈఎస్‌ఐ వివరాలు వెంటనే ఇవ్వాలని కోరుతున్నారు. పనికి తగ్గ వేతనం చెల్లిస్తూ రాష్ట్రం అంతా ఒకే సమయ పాలన ఉండాలని వారాంతపు సెలవులు ప్రకటించాలనే పలు డిమాండ్లతో బంద్‌లో పాల్గొంటున్నారు.   ఒప్పంద ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని భీమవరంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెల్లబోయిన రంగారావు డిమాండ్‌ చేశారు. మద్యం షాపుల బంద్‌ను జయప్రదం చేయాలని ఎం.లక్ష్మీపతి, సీతారాంప్రసాద్‌, మల్లుల శ్రీను అన్నారు.వీరవాసరం మండల అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు శుక్రవారం ఏపీ స్టేట్‌ బేవరేజస్‌ అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. 

Updated Date - 2021-04-24T04:52:48+05:30 IST