హోళీ సందర్భంగా మద్యం దుకాణాల బంద్

ABN , First Publish Date - 2022-03-17T21:18:36+05:30 IST

ఈనెల 18వ తేదీన హోళీ పండగను పురస్కరించుకుని నగరంలోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లతో కూడిన క్లబ్బులు, హోటళ్లను రెండు రోజుల పాటు మూసి వేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలుజారీ చేశారు.

హోళీ సందర్భంగా మద్యం దుకాణాల బంద్

హైదరాబాద్: ఈనెల 18వ తేదీన హోళీ పండగను పురస్కరించుకుని నగరంలోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లతో కూడిన క్లబ్బులు, హోటళ్లను రెండు రోజుల పాటు మూసి వేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలుజారీ చేశారు. గురువారం ఉదయం 6గంటల నుంచి ఈనెల 19వ తేదీ ఉదయం 6గంటల వరకు మూసి వుంచాలని అన్నారు. హోళీ సందర్భంగా నగరంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు ఒకప్రకటనలో తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాని హెచ్చరించారు. 

Updated Date - 2022-03-17T21:18:36+05:30 IST