మందు షాపుల చెంతనే సిట్టింగ్స్‌..చీర్స్‌!

ABN , First Publish Date - 2021-05-09T06:21:34+05:30 IST

సర్కారు మద్యం దుకాణాలు ఉన్న ప్రాంతాలు మినీబార్లుగా మారాయి. అక్కడ ఉండే ఖాళీ ప్రదేశాలు, బడ్డీ కొట్ల వద్ద మందుబాబు లు సిట్టింగ్‌ వేసి చీర్స్‌ చెప్పుకొంటున్నారు. దీంతో ప లు ప్రాంతాల్లో ప్రజలు, మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.

మందు షాపుల చెంతనే సిట్టింగ్స్‌..చీర్స్‌!
మందు తాగుతున్న మద్యంప్రియులు

మినీ బార్లను తలపిస్తున్న వైనం

కన్నెత్తి చూడని అధికారులు  


అద్దంకి, మే 8 : సర్కారు మద్యం దుకాణాలు ఉన్న ప్రాంతాలు మినీబార్లుగా మారాయి. అక్కడ ఉండే ఖాళీ ప్రదేశాలు, బడ్డీ కొట్ల వద్ద మందుబాబు లు సిట్టింగ్‌ వేసి చీర్స్‌ చెప్పుకొంటున్నారు. దీంతో ప లు ప్రాంతాల్లో ప్రజలు, మహిళలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వ చ్చిన తర్వాత నూతన మద్యం విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వమే వైన్‌ షాపులను నడుపుతోంది. అయితే అక్కడ సిట్టింగ్‌కు ఎలాంటి అవకాశం లే కుండా చేసింది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం నిబం ధనలు గాలికొదిలేసి మద్యం దుకాణాల చెంతనే సి ట్టింగ్‌ ప్రాంతాలు ఏర్పడ్డాయి. అక్కడి బడ్డీ కొట్లలో మద్యం  సేవించేందుకు అవసరమైన డిస్పోజల్‌ గ్లా సులు, నీళ్ల ప్యాకెట్లు, షోడా  కొనుగోలు చేసి ఆ ప క్కనే ఉన్న సిట్టింగ్‌ ప్రాంతాలలో దర్జాగా మద్యం సే విస్తున్నారు. కొన్నిచోట్ల బడ్డీ కొట్లే బార్లను తలపిస్తు న్నాయి. ప్రధానంంగా అద్దంకి పట్టణంలో ఐదు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. ఆర్టీసీ బ స్టాండ్‌ ప్రాంతంలో ఉన్న షాపు సమీపంలో అన్ని సౌకర్యాలు ఉండటంతో ఎక్కువ మంది అక్కడ సి ట్టింగ్‌ వేస్తున్నారు. మరికొన్ని చోట్ల షాపుల చెంతనే ఉన్న బడ్డీ కొట్లు అడ్డాగా మద్యం సేవిస్తు న్నారు. అ ద్దంకి సర్కిల్‌ పరిధిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాలకు సమీపంలోనే సిట్టింగ్‌లకు అ న్ని సౌకర్యాలు కల్పించారు. మరికొన్ని చోట్ల రోడ్ల వె ంబడి ఉన్న పొలాలనే అడ్డాగా చేసుకొని మద్యం తా గుతున్నారు. దీంతో మహిళలు పొలాలకు వెళ్లేందు కు భయపడుతున్నారు. ఇంతా జరుగుతున్నా అధికారులు ప ట్టించుకోకపోవటం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటికైనా స్పం దించి మద్యం దుకాణాల సమీపంలో, పొలాల్లో మద్యం సే వించకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.


Updated Date - 2021-05-09T06:21:34+05:30 IST