భూముల ధరలకు రెక్కలు

ABN , First Publish Date - 2020-09-11T10:55:58+05:30 IST

జిల్లాలో భూములకు భారీ డిమాండ్‌ పెరిగింది. వ్య వసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు

భూముల ధరలకు రెక్కలు

జిల్లాలో భారీగా పెరిగిన వ్యవసాయ, ఇళ్ల స్థలాల ధరలు

భూములపైనే రైతులు, వ్యాపారులు, ఉద్యోగుల పెట్టుబడులు

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు  సైతం దొరకని భూములు

భారీగా పెరుగుతున్న కబ్జాలు


నిజామాబాద్‌, సెప్టెంబరు 10  (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): 

జిల్లాలో భూములకు భారీ డిమాండ్‌ పెరిగింది. వ్యవసాయ భూముల నుంచి ఇళ్ల స్థలాల వరకు లక్షల రూపాయల నుంచి కోట్ల రూపాయల వరకు ధరలు పలుకుతున్నాయి. జిల్లాలో గడిచిన పదేళ్లలో వ్యాపారుల నుంచి ఉద్యోగుల వరకు భూముల పైననే పెట్టుబడి పెడుతుండడంతో ధరలు పెరిగాయి. జిల్లా కేంద్రంతో పాటు మున్సిపాలిటీల పరిధిలో ఊహించని రీతిలో ధరలు ఉన్నాయి. రియల్‌ ఎస్టేట్‌, అపార్ట్‌మెంట్‌లు బాగా నిర్మాణం అవుతుండటంతో భూముల ధరలు సామా న్యుడు వింటేనే జడుసుకునే రీతిలో పెరిగాయి. ధరలు భారీగా పెరగడంతో కబ్జాలు, ఆక్రమణలు కూడా బాగా జరుగుతున్నాయి. రెవెన్యూ, పంచాయతీ శాఖల అధికా రుల సహకారంతో ప్లాట్లు చేసిన వారు విక్రయించగా కొన్నవారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. భూముల ధరలు పెరగడం వల్ల గ్రామ, మండల, మున్సిపాలిటీల పరిధిలో ప్రభుత్వ అవసరాలకు కూడా దొరకని పరిస్థి తులు నెలకొన్నాయి. 


దశాబ్ద కాలంలో రెట్టింపైన భూముల ధరలు 

జిల్లాలో గడిచిన కొన్నేళ్లుగా భూముల రేట్లు బాగా పెరిగాయి. దశాబ్ద కాలంలో డబుల్‌కు మించి ధరలు పెరిగాయి. జిల్లాలో ఏ గ్రామ పరిధిలోకి వెళ్లినా ఎకరం రూ.పది లక్షలకు తక్కువగా ఎక్కడా లేదు. జాతీయ ర హదారులు, వ్యవసాయం బాగా ఉన్న గ్రామాల్లో ఎక రం రూ.50 లక్షల నుంచి రూ.2కోట్ల వరకు ధర పలుకు తోంది. ఇక నిజామాబాద్‌ నగర శివారులో ఊహించని రీతిలో ధరలు ఉన్నాయి. ఎకరం రూ.కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు పలుకుతున్నాయి. ప్రధాన రహదారులకు దగ్గరగా ఉన్న భూముల ధరలు ఎక్కువగా పలుకుతు న్నాయి. పదేళ్ల క్రితం నగర శివారులో ఎకరం రూ.25 లక్షల నుంచి రూ.50లక్షలు ఉండగా.. అదే భూమికి ప్ర స్తుతం రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు ధర పలు కుతోంది. గ్రామాల్లో పదేళ్ల క్రితం ఎకరం రూ.లక్ష నుం చి రూ.4లక్షల వరకు ధర పలుకగా.. ప్రస్తుతం ఆ ధర కు పావు ఎకరం కూడా వచ్చే పరిస్థితి లేదు. 


భూములపైనే పెట్టుబడి

గడిచిన పదేళ్లలో వ్యవసాయ పంటల దిగుబడి పెర గడం, నీళ్లు అందుబాటులోకి రావడంతో రైతులు ఏడా దికి రెండు నుంచి మూడు పంటలు పండిస్తున్నారు.ఽ వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు కూడా బాగా వస్తు న్నాయి. దీంతో గ్రామాల్లో రైతుల వద్దకు డబ్బులు వస్తే వాటిని భూములపైనే పెడుతున్నారు. వీరితో పాటు వ్యాపారాల్లో లాభాలు వచ్చిన వారు కూడా గత కొన్నే ళ్లుగా భూములు కొనుగోలు చేస్తున్నారు. ఎంత దూర మైనా వెళ్లి భూములను కొంటున్నారు. వీరితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు తమ గ్రామాలు, ఇతర ప్రాంతాల్లో భూములను కొనుగోలు చేస్తున్నారు. అందరూ తమ పెట్టుబడులను భూములపై పెడుతుండడంతో ధరలు అమాంతం పెరిగాయి.


ప్రస్తుత పరిస్థితుల్లో సామాన్యు డు భూములు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఇళ్ల స్థలాల ధరలు పెరగడంతో ఎక్కువ మంది కొనలేని పరిస్థితి నెలకొంది. నిజామాబాద్‌ నగరంతో పాటు శివారులో గజం భూమి ధర రూ.8 వేల నుంచి రూ.లక్ష వరకు ప లుకుతోంది. నగరం మధ్యలో గజం ధర రూ.2 లక్షలకు పైగా ఉంది. బోధన్‌, ఆర్మూర్‌ మున్సిపాలిటీల పరిధిలో రూ.6వేల నుంచి రూ.50 వేల వరకు పలుకుతోంది. ప దేళ్ల్ల క్రితం సగం కూడా లేని ధరలు ఒకేసారి పెరిగా యి. ఇళ్ల స్థలాలు దిగువ మధ్య తరగతి, పేదలు కొనలే ని పరిస్థితి ఉంది. 


ధరల పెరుగుదలతో అక్రమ లే అవుట్‌లు

భూముల ధరలు బాగా పెరుగడంతో అక్రమ లే అ వుట్‌లు వెలిశాయి. వందల సంఖ్యలో ప్లాట్లను చేసి అ మ్మకాలు చేశారు. ఇవి కూడా భారీగానే పెరిగాయి. జి ల్లాలో భూముల ధరలు పెరిగినప్పటి నుంచి భూ అక్ర మాలు ఎక్కువగానే జరుగుతున్నాయి. ధరలు లక్షల నుంచి కోట్లకు చేరడంతో ప్రభుత్వ, ప్రైవేటు భూములు ఆక్రమణకు గురవుతున్నాయి. రెవెన్యూ, పంచాయతీ శాఖలలోని కొంత మంది అధికారుల సహకారంతో అ మ్మకాలు జరుగుతున్నాయి. వీటితో పాటు అసైన్డ్‌, ఇత ర భూములు కూడా అన్యాక్రాంతం అయ్యాయి. చట్టాల లోని లొసుగులను ఆసరాగా చేసుకుని వీటిని అమ్మకా లు చేశారు. సమగ్ర భూప్రక్షాళనతో భూముల అక్రమ  బాగోతం వెలుగులోకి రాగా కొన్ని సక్రమంగా మారిపో యాయి. నిజామాబాద్‌ నగరం చుట్టూ గత పదేళ్లలో అమ్మిన భూములను పరిశీలిస్తే ఇవి ఎక్కవగా బయట పడుతున్నాయి. భూముల పట్టాదారునికి తెలువకుండా నే ఇతరుల పేరున పట్టాలు చేశారు. భూముల ధరలు పెరగడంతో కబ్జాలూ ఎక్కువగా జరుగుతున్నాయి. 


పెరుగుతున్న ఆక్రమణలు

జిల్లాలో భూముల ధరలు పెరగడంతో ఆక్రణలు కూడా పెరుగుతున్నాయి. నగరం చుట్టూ రెవెన్యూ, పంచా యతీ అధికారులుగా పని చేసిన వారి వల్లనే ఇవి ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. ఆర్మూర్‌, బోధన్‌లోనూ ఈ పరిస్థితి ఎక్కువగానే ఉంది. బోధన్‌లో చక్కెర ఫ్యాక్టరీ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఆర్మూర్‌ నడి బొడ్డున ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా పట్టించుకునే వారే లేరు. గ్రామ, మండలాల పరిధిలో చెరువు శిఖం భూములు, అటవీ, దే వాలయాల భూములు కూడా అన్యాక్రాంతమయ్యాయి.  


రియల్‌ రంగంలోకి రాజకీయ నేతలు

జిల్లాలో భూముల ధరలకు రెక్కలు రావడంతో అధి కార, ప్రతిపక్ష అనే తేడా లేకుండా నేతలందరూ భూ ములపైనే నజర్‌ పెట్టారు. తమ రాజకీయ ఎదుగుదల కు ఇది మార్గంగా చూస్తున్నారు. వీటిపై వచ్చే ఆదా యాన్ని తమ పదవులకు ఉపయోగిస్తున్నారు.


అభివృద్ధి పనులకు కరువైన స్థలాలు

గ్రామాలు, నగరాలలో ప్రభుత్వ అభివృద్ధి పనుల కో సం భూములు దొరకని పరిస్థితి ఉంది. పేదలకు ఇళ్ల స్థలాలకు కూడా భూములు దొరకడం లేదు. గతంలో ఇచ్చిన స్థలాలు మినహా ప్రస్తుతం స్థలాలు లేకపోవడ ం వల్ల సమస్యలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీ సుకువచ్చిన రెవెన్యూ చట్టంతో భూముల ధరలు తగ్గ కున్నా అక్రమాలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది, మండలాల పరిధిలో రిజిస్ట్రేషన్లు కావడం, ధరణి వెబ్‌ సైట్‌లో భూముల వివరాలు తెలుసుకునే అవకాశం ఉండడంతో మేలు జరగనుంది. భూముల రిజిస్ర్టేషన్‌, మ్యూటేషన్‌ ఒకే రోజు జరిగి పట్టా బుక్‌ రావడం వల్ల కబ్జాలకు కూడా అవకాశం ఉండదని రెవెన్యూ అధికా రులు తెలిపారు. గడిచిన కొన్నేళ్లలో జిల్లాలోని ఎక్కువ మంది తమ డబ్బులను భూములపైనే పెట్టడం వల్లనే ఈ రేట్లు పెరిగాయని పలువురు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపా రులు, భూముల బ్రోకర్లు తెలిపారు. వచ్చే రోజుల్లో మ రింత పెరగుతాయని వారు తెలిపారు. 

Updated Date - 2020-09-11T10:55:58+05:30 IST