Land Encroachers: భూ ఆక్రమణదారుల జాబితాలో వీవీఐపీలు

ABN , First Publish Date - 2022-09-14T16:43:04+05:30 IST

బెంగళూరు(Bengaluru) నగరంలో వెల్లువెత్తిన వరదలకు(flooding) భూఆక్రమణలే(encroachers) కారణమని బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ)...

Land Encroachers: భూ ఆక్రమణదారుల జాబితాలో వీవీఐపీలు

బీబీఎంపీ జాబితా విడుదల...సంచలనం

బెంగళూరు : బెంగళూరు(Bengaluru) నగరంలో వెల్లువెత్తిన వరదలకు(flooding) భూఆక్రమణలే(encroachers) కారణమని బృహత్ బెంగళూరు మహానగర పాలిక(బీబీఎంపీ) తాజాగా విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. వీవీఐపీలైన( VVIP names) బడా వ్యక్తులు, సంస్థలే వర్షపు నీటి కాల్వలు, మురుగునీటి కాల్వలు, చెరువులను ఆక్రమించి భవనాలు నిర్మించారని బీబీఎంపీ పేర్కొంది.(Bengaluru encroachers list)బెంగళూరు నగరంలో 700కుపైగా వర్షపునీటి కాల్వలు, డ్రైనేజీలను ఆక్రమించారని తేలింది.


 టెక్ పార్కులో కంపెనీలు, హై ప్రొఫైల్ బిల్డర్లు,(tech parks, high-profile builders) ప్రైవేటు ఆసుపత్రుల యజమానులే భూ ఆక్రమణలకు పాల్పడ్డారని వెల్లడైంది.ఆక్రమణ దారుల్లో విప్రో, ఎకో స్పేస్, ప్రెస్టీజ్, కొలంబియా ఆసియా ఆసుపత్రి,(Wipro Columbia Asia Hospital) బాగ్ మాని టెక్ పార్కు, దివ్యశ్రీ విలాస్, న్యూహారిజన్ కాలేజీ, ఆదర్శ్ రిట్రీట్ తదితర బడా సంస్థలు ఉన్నారని బీబీఎంపీ(Bruhat Bengaluru Mahanagara Palike) జారీ చేసిన నోటీసులో పేర్కొంది. భూ ఆక్రమణలు టెక్ కంపెనీలు, బడా వ్యాపారవేత్తలు, సాధారణ వ్యక్తులు ఎవరు చేసినా వాటిని వారంరోజుల్లో తొలగించాలని కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మయ్(Chief Minister Basavaraj Bommai) చెప్పారు. 


బెంగళూరు నగరంలో మొత్తం 696 ఆక్రమణలుండగా వాటిలో ఒక్క మహదేవాపురలో అత్యధికంగా 175 ఆక్రమణలున్నాయి.మున్సిపల్ అధికారులు బుల్డోజర్లతో ఆక్రమణల తొలగింపు(Bulldozers rolled) కార్యక్రమం చేపట్టారు. మహావీర్ రీగల్ అపార్టుమెంటును కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. 


Updated Date - 2022-09-14T16:43:04+05:30 IST