ఇన్ఫినిటీ లెర్న్‌ చేతికి విజ్‌క్లబ్‌

ABN , First Publish Date - 2022-05-26T10:11:26+05:30 IST

శ్రీ చైతన్య విద్యా సంస్థలకు చెందిన ఇన్ఫినిటీ లెర్న్‌ మరో స్టార్టప్‌ కంపెనీ విజ్‌క్లబ్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది.

ఇన్ఫినిటీ లెర్న్‌ చేతికి విజ్‌క్లబ్‌

రూ.75 కోట్లకు కొనుగోలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): శ్రీ చైతన్య విద్యా సంస్థలకు చెందిన ఇన్ఫినిటీ లెర్న్‌ మరో స్టార్టప్‌ కంపెనీ విజ్‌క్లబ్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేసింది. కోటి డాలర్లకు (దాదాపు రూ.75 కోట్లు) విజ్‌క్లబ్‌ వాటాను కొనుగోలు చేసినట్లు ఇన్ఫినిటీ లెర్న్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌ సుష్మా బొప్పన తెలిపారు. ఇన్ఫినిటీ లెర్న్‌ కార్యకలాపాలు ప్రారంభించిన ఏడాదిలోనే మూడు కొనుగోళ్లు చేసింది. ఇప్పటికే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ ‘టీచర్‌’, బహుభాష కంటెంట్‌ ప్లాట్‌ఫామ్‌ ‘డోంట్‌ మెమొరైజ్‌ను సొంతం చేసుకుంది. కాగ్నిటివ్‌ టెక్నాలజీలో  కార్యకలాపాలు నిర్వహిస్తున్న విజ్‌క్లబ్‌ 6-14 ఏళ్ల పిల్లల కోసం హాట్స్‌ (హైయర్‌ ఆర్డర్‌ థింకింగ్‌ స్కిల్స్‌), స్మార్ట్‌టెక్‌ ప్రోగ్రామ్స్‌ను అందిస్తోంది. ఈ కొనుగోలు ద్వారా కే12 విద్యార్థులకు ‘ఇన్ఫినిటీ ఫ్యూచర్జ్‌’ పేరుతో మరిన్ని సేవలను ఇన్ఫినిటీ లెర్న్‌ అందించనుంది. 

Updated Date - 2022-05-26T10:11:26+05:30 IST