BRS విజయవంతం కావాలని కోరుతున్నా: కుమారస్వామి

ABN , First Publish Date - 2022-10-05T20:36:43+05:30 IST

బీఆర్‌ఎస్ (BRS) విజయవంతం కావాలని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి (Kumaraswamy) కోరుకున్నారు.

BRS విజయవంతం కావాలని కోరుతున్నా: కుమారస్వామి

హైదరాబాద్: బీఆర్‌ఎస్ (BRS) విజయవంతం కావాలని కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి (Kumaraswamy) కోరుకున్నారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం కుమారస్వామి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ (Telangana)లో పథకాలు బాగున్నాయని ప్రశంసించారు. దేశమంతా ఇలాంటి పథకాలు అమలుకావాలని కుమారస్వామి ఆకాంక్షించారు. జేడీఎస్‌ నేతల రాక.. బీఆర్‌ఎస్‌ ఏర్పాటు కార్యక్రమానికి రావాల్సిందిగా పలు రాష్ట్రాల్లోని వివిధ పార్టీల నేతలకు కేసీఆర్‌ ఆహ్వానాలు పంపించారు. ఈ మేరకు కర్ణాటక నుంచి జేడీఎస్‌ నేత, మాజీ సీఎం కుమారస్వామి, మాజీ మంత్రి రేవణ్ణతోపాటు ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్‌ నేతలు ఇప్పటికే హైదరాబాద్‌ చేరుకున్నారు. వీరికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ బాల్క సుమన్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ తదితరులు బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం పలికారు. మరోవైపు తమిళనాడు నుంచి విదుతలై చిరుతైగల్‌ కచ్చి (వీసీకే) వ్యవస్థాపక అధ్యక్షుడు, చిదంబరం ఎంపీ తిరుమావళవన్‌ కూడా వచ్చారు. ఈయన ఒకసారి ఎమ్మెల్యేగా, మూడుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. ఈయనతోపాటు సీఎం ఆహ్వానం అందుకున్నవారిలో తమిళనాడు తెలుగు సంఘాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ద్రావిడ దేశం వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణారావు కూడా ఉన్నారు. వీరిద్దరికి ప్రగతిభవన్‌ ముందున్న ఐటీసీ కాకతీయ హోటల్లో బస ఏర్పాటు చేశారు.

Updated Date - 2022-10-05T20:36:43+05:30 IST