అగస్త్యతో... అవస్తి!

Published: Wed, 06 Jul 2022 00:19:50 ISTfb-iconwhatsapp-icontwitter-icon
అగస్త్యతో... అవస్తి!

‘పూలరంగడు’, ‘చుట్టాలబ్బాయి’ చిత్రాలతో విజయాలు అందుకొన్నారు వీరభద్రమ్‌. ఆయన దర్శకత్వంలో ఇప్పుడో చిత్రం రూపుదిద్దుకుంటోంది. నరేశ్‌ అగస్త్య కథానాయకుడు. నబిషేక్‌, తూము నర్సింహా పటేల్‌ నిర్మాతలు. ఈ చిత్రంలో కథానాయికగా శ్వేత అవస్తిని ఎంచుకొన్నారు. ఈనెలలోనే షూటింగ్‌ మొదలుకానుంది. నరేశ్‌, అవస్తిలపై కొన్ని కీలకమైన సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘వీరభద్రమ్‌ అంటే కామెడీ బ్రాండ్‌. ఈసారి ఓ షాకింగ్‌ కథతో వస్తున్నారు. ఆయన చెప్పిన కథ మాకెంతో బాగా నచ్చింది. అందుకే వెంటనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కిస్తున్నాం. అనూప్‌ రూబెన్స్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామ’’న్నారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International