డిశ్చారి అయిన మూడు గంటలకే

ABN , First Publish Date - 2020-08-09T10:17:23+05:30 IST

క్వారంటైన్‌ నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఆతర్వాత మూడు గంటలకే చనిపోయాడు. ఈ విషాద ఘటన డోన్‌ పట్టణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

డిశ్చారి అయిన మూడు గంటలకే

డోన్‌లో బస్టాండులో దిగగానే టైలర్‌ మృతి

డోన్‌, ఆగస్టు 8: క్వారంటైన్‌ నుంచి డిశ్చార్జి అయ్యాడు.  ఆతర్వాత మూడు గంటలకే చనిపోయాడు. ఈ విషాద ఘటన డోన్‌ పట్టణంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఓ టైలర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అతని కొడుకుకు కూడా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఇద్దరినీ పది రోజుల క్రితం కర్నూలులోని క్వారంటైన్‌కు తరలించారు.


టైలర్‌ ఆరోగ్యంగా ఉన్నాడని.. వైద్యులు శుక్రవారం క్వారంటైన్‌ నుంచి డిశ్చార్జి చేశారు. క్వారంటైన్‌ నుంచి ఆటోలో బస్టాండుకు పంపించారు. ఆ వ్యక్తి కర్నూలులో బస్సు ఎక్కి సాయంత్రం డోన్‌ ఆర్టీసీ బస్టాండులో దిగాడు. ఆ వెంటనే గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయాడు. కర్నూలు క్వారంటైన్‌లో ఉన్న కొడుకు తహసీల్దార్‌ నరేంద్రనాథ్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. అనంతరం ఆ వ్యక్తిని అంబులెన్స్‌లో కర్నూలుకు తరలించగా మృతి చెందాడు. క్వారంటైన్‌ నుంచి డిశ్చార్జి అయిన వ్యక్తి ఇంటికి చేరకుండానే మృత్యువాత పడ్డాడు. కుటుంబ సభ్యులో శోకసంద్రంలో మునిగి పోయారు. 

Updated Date - 2020-08-09T10:17:23+05:30 IST