తొడసం వంశీయుల ప్రత్యేక పూజలతో ఖాందేవ్‌ జాతర ప్రారంభం

ABN , First Publish Date - 2022-01-18T06:07:03+05:30 IST

నార్నూర్‌ మండల కేంద్రంలో గల ఖాందేవ్‌ ఆల యం వద్ద తొడసం వంశీయులు సోమవారం రాత్రి నిర్వహించిన పూజలతో నార్నూర్‌ జాతర ప్రారంభమైంది. తొడసం వంశీయుల ఆరాధ్య దైవం ఖాం దేవ్‌ ఆలయం వద్ద ఆదివాసీలతో కోలాహలంగా మారింది. చిత్తగూడకు చెందిన తొడసం వంశీయులు ఆదివారం మాన్కాపూర్‌ మర్రి చెట్టువద్దకు చేరుకొని సోమవారం ఆదివాసీ సంప్రదాయాలతో ఖాందేవ్‌

తొడసం వంశీయుల ప్రత్యేక పూజలతో ఖాందేవ్‌ జాతర ప్రారంభం
ఖాందేవ్‌ ఆలయానికి చేరుకున్న ఆదివాసీ గిరిజనులు

ఉట్నూర్‌, జనవరి 17: నార్నూర్‌ మండల కేంద్రంలో గల ఖాందేవ్‌ ఆల యం వద్ద తొడసం వంశీయులు సోమవారం రాత్రి నిర్వహించిన పూజలతో నార్నూర్‌ జాతర ప్రారంభమైంది. తొడసం వంశీయుల ఆరాధ్య దైవం ఖాం దేవ్‌ ఆలయం వద్ద ఆదివాసీలతో కోలాహలంగా మారింది. చిత్తగూడకు చెందిన తొడసం వంశీయులు ఆదివారం మాన్కాపూర్‌ మర్రి చెట్టువద్దకు చేరుకొని సోమవారం ఆదివాసీ సంప్రదాయాలతో ఖాందేవ్‌ ఆలయానికి చేరుకున్నారు. పుష్యమి, పౌర్ణమి సందర్భంగా సోమవారం అర్ధరాత్రి పూజ లు నిర్వహించడానికి ఆదివాసీలు సంప్రదాయ పూజలను ఖాందేవ్‌ ఆల యం వద్ద ప్రారంభించారు. చిత్తగూడ నుంచి తొడసం వంశీయులు ఖాం దేవ్‌ ప్రతిమలను తెచ్చారు. తొడసం వంశీయులు అయిన తెలంగ్‌రావు, రాజు, లచ్చు పటేల్‌, గోపాల్‌, సీతారాం, యాదవ్‌, భీంరావు, తొడసం నాగోరావుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఖాందేవ్‌ ఆల యం వద్ద కరోన నిబంధలనకు అనుగుణంగా ఈనెల 30వరకు జాతర నిర్వహిస్తామని ఆలయ కమిటీ చైర్మన్‌ మెస్రం రూప్‌దేవ్‌ తెలిపారు. మంగళవారం జంగుబాయి, సోనేరావు దంపతుల కూతురు చిత్తగూడకు చెందిన తొడసం వంశీయుల ఆడపడుచు యేత్మాబాయి నూనే తాగి మొక్కు చెల్లిస్తుందని తెలిపారు. కాగా, మంగళవారం నూనే తాగే కార్యక్రమం నిర్వహించనున్నామని తెలిపారు. జాతరకు వచ్చే భక్తుల కోసం, వ్యాపారుల కోసం ఏర్పాట్లు చేశామని సర్పంచ్‌ గజానంద్‌నాయక్‌ తెలిపారు.

Updated Date - 2022-01-18T06:07:03+05:30 IST