కాపురాలను కూల్చుతున్న కొత్త ట్రెండ్.. గిఫ్టుల పేరుతో ఏమార్చి రహస్యాలను భార్యాభర్తలు ఎలా బయటపెట్టుకుంటున్నారంటే..

ABN , First Publish Date - 2022-09-25T22:54:21+05:30 IST

అనుమానం పెనుభూతం అని పెద్దలు ఊరికే అనలేదు.. ఒక్కసారి పుట్టిన అనుమానం మనిసి చనిపోయే వరకూ ఉంటుంది. కొందరికైతే ప్రతి విషయంలోనూ అనుమానపడడం..

కాపురాలను కూల్చుతున్న కొత్త ట్రెండ్.. గిఫ్టుల పేరుతో ఏమార్చి రహస్యాలను భార్యాభర్తలు ఎలా బయటపెట్టుకుంటున్నారంటే..

అనుమానం పెనుభూతం అని పెద్దలు ఊరికే అనలేదు.. ఒక్కసారి పుట్టిన అనుమానం మనిసి చనిపోయే వరకూ ఉంటుంది. కొందరికైతే ప్రతి విషయంలోనూ అనుమానపడడం అలవాటైపోతుంది. ఇక భార్యాభర్తల విషయంలో ఇటీవల ఈ అనుమాన జబ్బు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అనుమానంతో భర్తను భార్య, భార్యను భర్త.. ఒకరినొకరు మోసం చేసుకుంటుంటారు. తద్వారా పచ్చని కాపురాలు సర్వనాశనం అవుతుంటాయి. ప్రస్తుత హైటెక్ యుగంలో ఈ అనుమానపు జబ్బు ఉన్న వారు.. టెక్నాలజీని వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. గిఫ్టుల పేరుతో భార్యాభర్తలు ఒకరి రహస్యాలు ఇంకొకరు ఎలా బయటపెట్టుకుంటున్నారో తెలుసుకుందాం..


భూమిపై చావు లేని జీవి ఒకటుందని చాలామందికి తెలీదు.. అదే హైడ్రా అనే జీవి. దీనికి చావు లేదట.. చిరకాలం బతికే ఉంటుంది. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఈ అనుమానం, సందేహం అనేవి కూడా ఈ హైడ్రా జీవి వంటివే. ఒకసారి పుడితే వీటికి కూడా చావు ఉండదు. అయితే ఈ అనుమానం కారణంగా కొన్నిసార్లు సంసారాలు నాశనం అవుతుంటాయి. ప్రస్తుత హైటెక్ యుగంలో అనుమానాలు, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు.. చాలా మంది టెక్నాలజీని వాడుకుంటున్నారు. తనకు తెలీకుండా భర్త ఏం చేస్తున్నాడో.. అలాగే తనను కాదని భార్య ఎవరితో మాట్లాడుతుందో.. అనే సందేహాలను తీర్చుకునేందుకు వివిధ మార్గాలను అన్వేషిస్తున్నారు. జైపూర్‌కు చెందిన కొంతమంది దంపతుల ఉదంతమే ఇందుకు ఉదాహరణ..

ఏడాదిన్నరగా కొడుకు మృతదేహాన్ని ఇంట్లో ఉంచిన తల్లిదండ్రులు.. సడన్‌గా ఊపిరి రావడంతో ఇలా చేశామని చెబుతూ..


పుట్టిన రోజున భార్యకు బహుమతి ఇచ్చి.. 

జైపూర్‌కు చెందిన అంకిత్, నిఖిత దంపతులకు ఇటీవలే వివాహమైంది. వివాహానంతరం భార్య మొదటి పుట్టిన రోజుకు.. ఖరీదైన ఫోన్‌ను బహుమతిగా ఇచ్చాడు. 5 రోజుల తర్వాత నిఖితకి.. అంకిత్ కొన్ని స్క్రీన్‌షాట్‌లను వాట్సాప్‌లో పంపాడు. తన కాలేజీ ఫ్రెండ్‌తో చేసిన చాటింగ్ స్క్రీన్‌షాట్‌లను చూసిన తర్వాత ఆమెకు మతి పోయింది. మొబైల్‌లో ఫేస్ లాక్ తదితర సెక్యూరిటీ సౌకర్యాలు ఉన్నా.. చాట్ వివరాలు భర్తకు ఎలా చేరాయా అని ఆశ్చర్యపోయింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. చివరకు కోర్టుల వరకూ వెళ్లారు. వివాహమైనప్పటి నుంచి నిఖిత ఫోన్‌లో బిజీగా ఉండేదని అంకిత్ చెప్పాడు. దీంతో భార్యపై నిఘా పెట్టాడు. ఆమెకు బహుమతిగా ఇచ్చిన ఫోన్‌లో స్పై యాప్ ఇన్‌స్టాల్ చేశాడు. తద్వారా నిఖిత వాట్సాప్‌లోని చాటింగ్ వివరాలన్నీ అంకిత్ మొబైల్‌కి చేరిపోయాయి.

సీనియర్లు చేసిన పనికి.. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న యువతులు.. పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించగా..


భర్త బండారం బయటపెట్టిన స్మార్ట్ వాచ్.. 

జైపూర్‌లోని సివిల్ లైన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న పూజ.. మార్కెటింగ్ కంపెనీలో పని చేస్తోంది. ఈమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. పూజ భర్తకు ఉద్యోగ రీత్యా టూర్లు ఎక్కువగా పడుతుంటాయి. ఒక్కోసారి అర్ధరాత్రికి ఇంటికి వస్తుంటాడు. అప్పటికీ ఫోన్లలో మాట్లాడుతూనే ఉంటాడు. చివరికి బాత్రూమ్‌లో కూడా ఫోన్లు మాట్లాడుతుండేవాడు. మొదట ఆఫీసు పనులేమో అనుకుని పట్టించుకోలేదు. చివరకు అనుమానం వచ్చి.. భర్త గురించి తెలుసుకోవాలని అనుకుంది. ఓ రోజు అతడికి స్మార్ట్ వాచ్‌ని గిఫ్ట్‌గా ఇచ్చింది. ఆఫీసు టూర్ అని చెప్పి ప్రియురాలితో తిరుగున్నట్లు గుర్తించింది. మొదట బుకాయించిన భర్త.. చివరకు తన తప్పును అంగీకరించాడు. ప్రస్తుతం వీరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

World Biggest Killer: షాకింగ్.. ప్రతీ యేటా 4 కోట్ల మందికి పైగా జనాల ప్రాణాలను తీస్తున్నది ఏంటో తెలుసా..?


కొంపముంచిన స్పై యాప్‌..

జైపూర్‌కు చెందిన వనితకు ఇటీవలే నిశ్చితార్థం అయింది. ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆమె.. భర్త కోరిక మేరకు పెళ్లికి ముందే జాబ్ మానేసింది. వివాహమైన తర్వాత ప్రతి విషయంలో భర్త అనుమానించడం మొదలెట్టాడు. చివరకు తల్లిదండ్రులతో కూడా ఫోన్లలో మాట్లాడనిచ్చేవాడు కాడు. ఒకవేళ ఆమె ఎవరితో మాట్లాడినా వెంటనే భర్తకు తెలిసిపోయేది. దీంతో ఓ రోజు ఆమె స్నేహితురాలికి విషయం తెలియజేసింది. వనిత ఫోన్‌ను పరిశీలించగా.. అందులో స్పై యాప్‌‌ను ఉండడాన్ని గమనించారు. ఈ యాప్ ద్వారా (Spy app) ఫోన్, చాటింగ్, లొకేషన్ తదితర వివరాలన్నింటినీ (Phone, Chatting, Location Details) భర్త తెలుసుకునేవాడు. ఈ విషయం తెలుసుకున్న వనిత.. ఓ రోజు భర్తకు తెలీకుండా అతడి ఫోన్‌లో అదే యాప్‌ని ఇన్‌స్టాల్ చేసింది. కొన్నాళ్లకు తన భర్త.. వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలుసుకుంది. ఈ విషయంలో జరిగిన గొడవల కారణంగా ప్రస్తుతం వీరు విడివిడిగా జీవిస్తున్నారు.

నీళ్లు కావాలని యువతిని అడిగిన ఫుడ్ డెలివరీ బాయ్.. ఆమె వెనుకే లోపలికి వెళ్లి.. ముద్దులు పెట్టి మరీ...


ప్రైవేట్ డిటెక్టివ్ సాయంతో.. 

జైపూర్‌లోని వైశాలి నగర్‌ పరిధికి చెందిన అమిత్, అంజలి దంపతులకు 2010లో వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మానస సరోవరంలో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అయితే అత్త, భార్య మధ్య విభేదాలు తలెత్తడంతో ప్రస్తుతం తల్లిదండ్రులకు దూరంగా భార్యా, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఇదిలావుండగా, ఇటీవల భార్య ప్రవర్తనలో మార్పును గమనించాడు. ఓ రోజు రాత్రి వేళ ఆమె సెల్‌కు మెసెజ్ వచ్చింది. అయితే వెంటనే దాన్ని డిలీట్ చేయడంతో భర్తకు అనుమానం తలెత్తింది. భార్య వ్యవహారం కనుక్కోవాలనే ఉద్దేశంతో  ప్రైవేట్ డిటెక్టివ్‌ని (Private detective) కలిశాను. సుమారు రూ.15 వేలు ఫీజు ఇచ్చి మరీ.. తన భార్య విషయం తేల్చాలని కోరాడు. వారం రోజుల పాటు ఆమెను అనుసరించిన డిటెక్టివ్‌.. చివరకు అంజలి తన కళాశాల స్నేహితుడితో వివాహేతర సంబంధం (extramarital affair) కొనసాగిస్తోందని గుర్తించాడు. ప్రస్తుతం ఈ దంపతుల విడాకుల కేసు (Divorce cases) కోర్టులో నడుస్తోంది.

వార్తాపత్రికలో పెళ్లి ప్రకటన చూసి యువతికి ఫోన్.. చివరకు తన తల్లి ఆరోగ్యం బాలేదంటూ ఆమె చెప్పిన మాటలు విని..


భర్త పేరుతో ఇన్‌స్టాగ్రామ్ క్రియేట్ చేసి.. 

జైపూర్‌లోని వైశాలి నగర్‌లో నివాసం ఉంటున్న శివమ్, నిషా దంపతులకు 2015లో వివాహమైంది. నిషాకు ట్రావెల్ అంటే ఇష్టం ఉండడంతో  హనీమూన్‌కి మాల్దీవులకు వెళ్లి వచ్చారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో శివమ్ తన భార్యతో కలిసి తల్లిదండ్రుల వద్ద ఉంటూ.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడు. అయితే అత్తగారింట్లో ఉండడం నిషాకు నచ్చలేదు. ప్రత్యేకంగా ఉందామంటూ రోజూ గొడవ చేసేంది. అయినా భర్త వినకపోవడంతో  లాక్‌డౌన్ సడలింపు తర్వాత పుట్టింటికి వెళ్లిపోయింది. అయినా భర్త తన మాట వినలేదని.. చివరకు ప్రైవేట్ డిటెక్టివ్ సాయంతో భర్త పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ (Fake Instagram account) క్రియేట్ చేసింది. భర్త ఆఫీసులోని సహచర ఉద్యోగుల ఫొటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా పోస్టు చేసింది. దీంతో శివమ్‌కు ఆఫీసులో సమస్యలు తలెత్తాయి. చివరకు విషయం తెలుసుకున్న భర్త.. తన భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వీరు కూడా విడాకులు తీసుకునేందుకు సిద్ధపడ్డారు.

అతను నాకంటే చిన్నవాడు.. అలా చేశాడంటే ఎవరూ నమ్మరు.. అంటూ లేఖ రాసిన యువకుడు.. తప్పక ఇలా చేయాల్సి వస్తోందంటూ..


టెక్నాలజీ సాయంతో భార్యాభర్తలు.. ఒకరి విషయాలు మరొకరు తెలుసుకోవడం వల్ల చివరకు సంసారాలను నాశనం చేసుకుంటున్నారు. జైపూర్‌లోని ఫ్యామిలీ కోర్టులో ప్రస్తుతం రోజూ 4, 5 విడాకుల దరఖాస్తులు దాఖలు అవుతున్నాయి. ఒక్క జైపూర్‌లోనే కాకుండా అన్ని ప్రాంతాల్లో రోజూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అనుమానం మొదలైన వెంటనే యాప్‌ ద్వారా ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకుంటున్నారు. WhatsApp, Instagram, Facebook యొక్క అనేక క్లోనర్ యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇతరుల మొబైల్‌లో ఇన్‌స్టాల్ చేయడం ద్వారా.. చాటింగ్ వివరాలన్నీ తెలుసుకుంటున్నారు. కొన్ని యాప్‌లు మొబైల్‌లో ఉన్నా గ్యాలరీలో కనిపించవు. మనకు తెలీకుండానే ఫొటోలు, వాయిస్, వీడియో కాల్స్ అన్నింటినీ రికార్డు చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఫోన్‌ను చెక్ చేసుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. యాంటీ స్టాకర్‌వేర్ లేదా స్పైవేర్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా స్టాకర్‌వేర్ యాప్‌ను గుర్తించవచ్చని చెబుతున్నారు.

మాకు నిశ్చితార్థం జరిగింది.. తను నాకు కాబోయే భార్య.. దయచేసి మమ్మల్ని వదిలిపెట్టండని.. కాళ్లు పట్టుకుని వేడుకున్నా..



Updated Date - 2022-09-25T22:54:21+05:30 IST