ltrScrptTheme3

సినిమా టికెట్ల అమ్మకంతో..ప్రభుత్వానికేం పని?

Sep 10 2021 @ 02:51AM

  • ఆస్తులు, పోర్టులతోపాటు వాటినీ వదలరా?
  • సినీ పరిశ్రమ పెద్దలు నోరు మెదపరేం?
  • ఛీ.. ఇంత దిగజారిపోతారా..: రఘురామ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 9(ఆంధ్రజ్యోతి): ‘సినిమా టికెట్ల అమ్మకాలతో ప్రభుత్వానికేం పని? సినీ పరిశ్రమ, థియేటర్ల వ్యాపారంలో ప్రభుత్వ జోక్యం ఏమిటి?’ అని వైసీపీ రెబల్‌ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. గురువారం ఢిల్లీలో ఆయన  మీడియాతో మాట్లాడుతూ ‘ఏపీ సినీ పరిశ్రమాభివృద్ధి సంస్థ(ఎ్‌ఫడీసీ) ద్వారా సినిమా టికెట్లు అమ్మడం సమంజసం కాదు. రిజిస్ర్టేషన్‌ కార్యాలయాల్లో ఆస్తులు రిజిస్ర్టేషన్‌ చేయించుకోగా ప్రభుత్వానికి వచ్చే డబ్బుకే ఏపీలో భద్రతలేదు. అలాంటప్పుడు సినిమా టికెట్ల ఆదాయానికి భద్రత ఏముంటుంది?వినోద పన్నులు చెల్లించకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఎలాగూ ఉన్నప్పుడు, టికెట్లను ప్రభుత్వమే అమ్ముకోవడమేంటి? ఈ దిక్కుమాలిన విధానమేంటి? విచిత్రంగా ఉంది. సినిమాల గురించి ముఖ్యమంత్రికి ఏం తెలుసు? సినిమా టికెట్లపై ప్రభుత్వ పెత్తనం ఎంతవరకు సమంజసం?   ఇంత జరుగుతున్నా సినీపరిశ్రమ పెద్దలెవ్వరూ ఎందుకు నోరు మెదపడంలేదు. గతంలో ఘట్టమనేని కృష్ణ వంటి హీరోలు పట్టించుకునే వారు. ఇపుడు చిరంజీవి, మహే్‌షబాబు, పవన్‌కల్యాణ్‌ కూడా పట్టించుకోకపోవడం న్యాయం కాదు. సినీ పరిశ్రమపై ఆధారపడుతున్న పవన్‌ కల్యాణ్‌ కూడా పట్టించుకోకపోతే ఎలా?’ అని రఘురామ నిలదీశారు. ఇప్పటికైనా సినీ పరిశ్రమంతా ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. 

‘జగనన్న చేపల దీవెన’.. పెడతారా?

‘సీఎం జగన్‌రెడ్డిగారూ సినిమా టికెట్లమ్మేస్తాం.. పోర్టులు అమ్మేస్తాం.. ఇదేంటి? రాష్ట్ర ప్రభుత్వం మటన్‌ అమ్ముతుందంట. మటన్‌ మార్టులు పెడతారంట. ఈ వార్త జగన్‌ మీడియాలోనే వచ్చింది. ఛీ.. ఇంత దిగజారడమా? అన్నీ అమ్మకాలేనా? చేపల నుంచి మటన్‌వరకు అమ్మకాలు మొదలు పెట్టి, జగనన్న చేపల దీవెన, జగనన్న మాంసం దీవెన అనే పేర్లు పెడతారేమో! మెజార్టీ ప్రజలు కూరగాయలే తింటారు గనుక ప్రభుత్వం జగనన్న కూరగాయల దీవెన పేరుతో సరసమైన ధరలకు కూరగాయలను అమ్మిస్తే బాగుంటుంది. వినాయకచవితికి రాష్ట్ర ప్రభుత్వం విధించిన ఆంక్షలు తొలగించిన హైకోర్టుకు ధన్యవాదాలు.   అలాగే చెత్తను సంపదగా మార్చే పథకం కేంద్రాలకు వైసీపీ రంగులు వేయడం హాస్యాస్పదంగా ఉంది. ప్రజలు పార్టీని మరచిపోతారన్న భయంతోనే ప్రభుత్వ భవనాలకు, వాహనాలకు రంగులు వేస్తున్నారా అన్న అనుమానం కలుగుతోంది. కరోనా వాక్సినేషన్‌ ప్రక్రియలో ఏపీ చివరి స్థానంలో ఉంది. కరోనా కోసం కేంద్రం నుంచి  వచ్చిన డబ్బు ఏవిధంగా ఖర్చుచేసారో తేలాలి. నరసరావుపేట పర్యటనకు వెళ్తున్న టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ను పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికం’ అని రఘురామ ధ్వజమెత్తారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.