గుంతకల్లులో 40 నామినేషన్ల ఉపసంహరణ

ABN , First Publish Date - 2021-03-03T07:10:32+05:30 IST

స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో మం గళవారం మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రా రంభమైంది.

గుంతకల్లులో 40 నామినేషన్ల ఉపసంహరణ
రాయదుర్గంలో నామినేషన్ల ఉపసంహరణ కేంద్రం వద్ద డీఎస్పీ రమ్య

గుంతకల్లు టౌన, మార్చి 2: స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో మం గళవారం మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ప్రా రంభమైంది. ఇందుకోసం అధికారులు ప్రత్యేకంగా 9 కౌంటర్లు ఏర్పాటు చే శారు. తొలిరోజు మున్సిపాలిటీ పరిధిలో 40 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. టీడీపీ 8, వైసీపీ 25, బీజేపీ 2, ఇండిపెండెంట్లు 2 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. కాగా ఉప సంహరణ ప్రక్రియ బుధవారం కూడా కొనసాగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ షర్పూద్దీన ఆధ్వర్యంలో టూటౌన, రూరల్‌ సీఐలు గోవిందు, రియాజ్‌ అహమ్మద్‌ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు నిర్వహించారు. 


వైసీపీ అభ్యర్థి ఏకగీవ్రం

పట్టణంలోని 22వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి గుత్తి యాస్మిన, టీ డీపీ, వైసీపీకి చెందిన మరో ఇద్దరు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో వైసీపీ అభ్యర్థి ఎన వెంకటలక్ష్మి ఏకగీవ్రమైంది.


గుత్తిలో 18 నామినేషన్లు..

గుత్తి: స్థానిక మున్సిపాలిటీలో మంగళవారం నామినేషన్ల ఉపసంహర ణ కార్యక్రమాన్ని అధికారులు నిర్వహించారు. 18 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 25 వార్డులకు 119 మం ది నామినేషన్లు దాఖలు చేశారు. కాగా 21వ వార్డుకు ఒకే నామినేషన దా ఖలు కావడంతో వైసీపీ అభ్యర్థి బోయ శివరాం ఏకగ్రీవమయ్యారు. 14వ వార్డులో వైసీపీ రెబల్‌ అభ్యర్థి పార్వతమ్మ నామినేషన ఉపసంహరించుకో వడంతో వైసీపీ కౌన్సిలర్‌ అభ్యర్థి కృపా సుజాతమ్మ ఏకగ్రీవమయ్యారు. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. నామినేషన్లు ఉపసంహరించుకున్న వారిలో ఇండిపెండెంట్లు 9 మంది, వైసీపీ నుంచి నలుగురు, టీ డీపీకి చెందిన నలుగురు, బీజేపీ నుంచి ఒకరు ఉన్నారు.


కళ్యాణదుర్గంలో 8 నామినేషన్లు.. 

కళ్యాణదుర్గం : మున్సిపల్‌ ఎన్నికల్లో భాగంగా గత ఏడాది మార్చిలో నామినేషన సందర్భంగా పట్టణంలో 84 నామినేషన్లు దాఖలయ్యాయి. మంగళవారం మొదటి రోజు నామినేషన ఉపసంహరణలో వైసీపీ 7, టీ డీపీ ఒక నామినేషనను ఉపసంహరించుకున్నట్లు అసిస్టెంట్‌ ఎన్నికల అ ధికారి వెంకట్రాముడు తెలిపారు. 


రాయదుర్గంలో 34 నామినేషన్లు.. 

రాయదుర్గం టౌన : పురపాలక సంఘం కార్యాలయంలో 32 వార్డుల కు 166 నామినేషన్లు దాఖలు కాగా, ఆరు తిరస్కరణకు గురయ్యాయి. మంగళవారం పురపాలక సంఘం కార్యాలయం, తహసీల్దార్‌ కార్యాలయ సమావేశ భవనంలో మొత్తం ఎనిమిది కేంద్రాలు ఏర్పాటు చేసి నామినేష న్ల ఉపసంహరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి రోజు 34 నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. వైసీపీ నుంచి 28, టీడీపీ నుంచి ఐదు, స్వతంత్ర అభ్యర్థి ఒకరు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. జిల్లా సహాయ ఎన్నికల అధికారి, మున్సిపల్‌ కమిషనర్‌ జబ్బార్‌ మియా, ఎన్నిక ల అధికారుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. కళ్యాణదుర్గం డివిజన డీఎస్పీ రమ్య మున్సిపల్‌ కార్యాలయంలో కొనసాగుతున్న నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పర్యవేక్షించారు.  


తాడిపత్రిలో 49 నామినేషన్లు..

తాడిపత్రి టౌన : మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి తొలిరోజు మం గళవారం 49 మంది కౌన్సిలర్‌ అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకున్నారని కమిషనర్‌ నరసింహప్రసాద్‌ తెలిపారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఒక్కొక్కరి నామినేషనను పరిశీలించి ఉపసంహరణ చేశారు. 36 వార్డులకు గాను మొత్తం 208 నామినేషన్లు వచ్చాయి. వీటిలో వైసీపీ 127, టీడీపీ 57, బీజేపీ 5, సీపీఐ 6, ఇండిపెండెంట్‌లు 13, జనసేన ఒకటి ఉన్నాయి. ఉపసంహరణ మొదటిరోజు వైసీపీ తరపున 40, టీడీపీ తరపున 2, ఇండిపెండెంట్‌లు ఏడుగురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు సమయం ఉందన్నారు.


భారీ బందోబస్తు

మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఉపసంహరణకు డీఎస్పీ చై తన్య ఆదేశాలమేరకు సీఐ ప్రసాద్‌రావు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఉపసంహరణకు వచ్చే అభ్యర్థులను కార్యాలయం బయటే సంబంధిత పత్రాలను ఎస్‌ఐ ప్రదీ్‌పకుమార్‌, మున్సిపల్‌ అధికారులు పుల్లయ్య పరిశీలించి అభ్యర్థిని మాత్రమే లోపలికి పంపించారు. ఎ లాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా కానిస్టేబుళ్లతో పాటు స్పెషల్‌పార్టీ పోలీసులు పలుచోట్ల ఉంటూ బందోబస్తు నిర్వహించారు. 

Updated Date - 2021-03-03T07:10:32+05:30 IST