25లోగా నాడు, నేడు పనులు పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2021-04-19T05:22:01+05:30 IST

పాఠశాలల్లో నాడు, నేడు అభివృద్ధి పనులు ఈనెల 25లోగా పూర్తిచేయాలని చింతపల్లి గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజి నీర్‌ జె.చాణిక్యరావు అన్నారు.

25లోగా నాడు, నేడు పనులు పూర్తిచేయాలి
సీలేరులో అదనపు వసతి గృహం నిర్మాణాలు పరిశీలిస్తున్న డిఈఈ చాణిక్యరావు


 చింతపల్లిలో రూ.5 కోట్లతో ఏకలవ్య ఆదర్శ పాఠశాల  

 టీడబ్ల్యు డీఈఈ చాణిక్యరావు 

చింతపల్లి, ఏప్రిల్‌ 18: పాఠశాలల్లో నాడు, నేడు అభివృద్ధి పనులు ఈనెల 25లోగా పూర్తిచేయాలని చింతపల్లి గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజి నీర్‌ జె.చాణిక్యరావు అన్నారు. ఆదివారం చింతపల్లి, జీకేవీధి మండలాల్లో ఆయన పర్యటించి పలు పాఠశాలల్లో జరుగుతున్న నాడు, నేడు, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు. చింతపల్లి, జీకేవీధి, కొ య్యూరు మండలాల్లో మొదటి విడతగా 94 పాఠశాలల్లో నాడు, నేడు పనులు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే 90శాతం పూర్తయ్యాయన్నారు. సీలేరులో రూ.2కోట్లతో ఏపీఆర్‌ కళాశాల వద్ద అదనపు వసతి గృహాలను నిర్మి స్తామన్నారు. చింతపల్లిలో రూ. 5 కోట్లతో ఏకలవ్య ఆదర్శ ఉన్నత పాఠశాలల నిర్మాణం చేపడతామన్నారు. బాల, బాలికలకు వేర్వేరుగా వసతి గృహాలు, సిబ్బంది క్వార్టర్స్‌, తరగతి గదులు, మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. రూ.3.42కోట్ల ఈఐ నిధులతో జరుగుతున్న జర్రెల రహదారి నిర్మాణం 50 శాతం పూర్తిచేశామన్నారు.రామిమానుపాల తారు రోడ్డు నిర్మాణానికి రూ.1.50కోట్లు మంజూరయ్యాయన్నారు.  ఆయన వెంట జీకేవీధి ఏఈఈ దుర్గా ప్రసాద్‌రావు, చింతపల్లి ఏఈ రఘునాథరావునాయుడు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-19T05:22:01+05:30 IST