ఆమె తన సమస్య గురించి ఫిర్యాదు చేయడానికి వెళ్లింది.. మూడ్రోజుల పాటు ఆమెను స్టేషన్‌లోనే ఉంచి పోలీసులు చేసిన దారుణం ఏంటంటే..

ABN , First Publish Date - 2021-12-27T22:44:26+05:30 IST

21 ఏళ్ల తమ బంధువులమ్మాయి కనిపించడం లేదని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది..

ఆమె తన సమస్య గురించి ఫిర్యాదు చేయడానికి వెళ్లింది.. మూడ్రోజుల పాటు ఆమెను స్టేషన్‌లోనే ఉంచి పోలీసులు చేసిన దారుణం ఏంటంటే..

21 ఏళ్ల తమ బంధువులమ్మాయి కనిపించడం లేదని ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది.. తప్పిపోయిన యువతి గురించి అన్వేషించేందుకు ఈమెను కూడా పోలీసులు స్టేషన్‌లోనే ఉంచేశారు.. మహిళా కానిస్టేబుల్ లేకపోయినా ఆ మహిళను రాత్రి స్టేషన్‌లోనే ఉండమన్నారు.. అర్ధరాత్రి సమయంలో కానిస్టేబుల్ ఆమెపై అత్యాచారయత్నం చేశాడు.. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు.. తర్వాతి రోజు స్టేషన్ అంతా తుడిపించి, వంట చేయించి, గిన్నెలు కూడా కడిగించాడు.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. 


తమ కుటుంబానికి చెందిన 21 ఏళ్ల యువతి కనిపించడం లేదని ఫిర్యాదు చేసేందుకు ఆ గిరిజన మహిళ ఉదయ్‌పూర్‌కు సమీపంలోని పనర్వా పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది. తప్పిపోయిన యువతి గురించి అన్వేషించాలని చెప్పి ఆ మహిళను పోలీసులు స్టేషన్‌లోనే ఉండమన్నారు. మహిళా కానిస్టేబుల్ లేకపోయినా ఆ మహిళను రాత్రి స్టేషన్‌లోనే ఉంచేశారు. అర్ధరాత్రి సమయంలో కానిస్టేబుల్ జితేందర్ సింగ్ ఆమెపై అత్యాచార యత్నం చేశాడు. ఆమె గట్టిగా అరిచి గొడవ చేయడంతో బయటకు పంపేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. 


తర్వాతి రోజు ఉదయం ఆమె చేత స్టేషన్ మొత్తం క్లీన్ చేయించాడు. ఆమె చేత వంట చేయించడమే కాకుండా, పాత్రలన్నీ కడిగించాడు. ఆమె స్టేషన్‌లో జరిగిన మొత్తం విషయాన్ని గ్రామ పెద్దలకు చెప్పడంతో వారు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ద్వారా సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ ఆ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఆ ఘటనపై విచారణకు ఆదేశించారు. 

Updated Date - 2021-12-27T22:44:26+05:30 IST