నెయిల్‌ పాలిష్‌ చెదరకుండా!

ABN , First Publish Date - 2021-02-20T06:10:51+05:30 IST

ఇష్టంగా గోళ్లకు వేసుకున్న నెయిల్‌ పాలిష్‌ ఎక్కువ రోజులు ఉండాలనుకుంటాం. కానీ రెండు మూడు రోజులకే నెయిల్‌ పాలిష్‌ ఊడిచ్చేస్తుంటుంది. ఈసారి గోళ్లను సింగారించుకునే ముందు ఇలా చేయండి

నెయిల్‌ పాలిష్‌ చెదరకుండా!

ఇష్టంగా గోళ్లకు వేసుకున్న నెయిల్‌ పాలిష్‌ ఎక్కువ రోజులు ఉండాలనుకుంటాం. కానీ రెండు మూడు రోజులకే నెయిల్‌ పాలిష్‌ ఊడిచ్చేస్తుంటుంది. ఈసారి గోళ్లను సింగారించుకునే ముందు ఇలా చేయండి.


టాప్‌కోట్‌: నెయిల్‌ పాలిష్‌ ఎక్కువ రోజులు నిలిచి ఉండాలంటే టాప్‌కోట్‌ తప్పసరి. నెయిల్‌ పాలిష్‌ ఆరిన తరువాత టాప్‌కోట్‌ వేసుకుంటే అది ఒక పొరలా ఏర్పడి గోళ్లు అద్దంలా మెరుస్తాయి. ఏ రకం నెయిల్‌ పాలిష్‌ అయినా టాప్‌కోట్‌ వేసుకోవడం మరచిపోవద్దు.


హ్యాండ్‌ క్రీమ్‌: ఈ క్రీమ్స్‌ సన్‌స్ర్కీన్‌లా పనిచేస్తాయి. రోజుకు రెండుసార్లు హ్యాండ్‌ క్రీమ్‌ రాసుకుంటే చేతులు పొడిబారవు. గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అంతేకాదు గోళ్ల దగ్గరి క్యుటికిల్‌ దెబ్బతినదు.


బేస్‌కోట్‌: టాప్‌కోట్‌కి ముందే బేస్‌కోట్‌ అప్లై చేయాలి. ఇలాచేస్తే నెయిల్‌ పాలిష్‌ గోళ్లకు చక్కగా అంటుకుంటుంది. పాలిష్‌ తొందరగా పోదు. దాంతో గోళ్లు చూడముచ్చటగా కనిపిస్తాయి.


రబ్బర్‌ గ్లౌజులు: ఇంటిపనులు చేసే సమయంలో చేతులకు రబ్బర్‌ గ్లౌజులు తొడుక్కోవాలి. ఈ గ్లౌజులు చేతులపై నీళ్లు పడకుండా చూస్తాయి. కాబట్టి గోళ్ల రంగు చెక్కు చెదరదు.

Read more