నడిపించేది ఆయనే

ABN , First Publish Date - 2022-01-21T05:30:00+05:30 IST

మనం చేసే ప్రతి పని దేవుడి సంకల్పం ప్రకారమే జరుగుతుంది. మంచి పనులు చెయ్యాలనే ఆలోచనను, కోరికను మనలో కలిగించేది ఆ దైవమే. కే..

నడిపించేది ఆయనే

మనం చేసే ప్రతి పని దేవుడి సంకల్పం ప్రకారమే జరుగుతుంది. మంచి పనులు చెయ్యాలనే ఆలోచనను, కోరికను మనలో కలిగించేది ఆ దైవమే. కేవలం ఆ ఆలోచనను మనలో కలిగించడం మాత్రమే కాదు... పని చేసేటప్పుడు దానికి ఆయన సహాయం చేస్తాడు. అడుగడుగునా చేయి అందిస్తాడు. అవాంతరాలను తొలగిస్తాడు. దివ్యమైన ఆయన అనుగ్రహం వల్లనే మనం ఆ పనులను పూర్తి చేయగలుగుతాం. కానీ... ఆ పని మనమే చేసినట్టు ఘనత అంతా మనకే దక్కుతుంది. మంచి పని చేసినందుకు ఆయన మనకు ఇచ్చే బహుమానం అది. తన సంకల్పం ద్వారా, తన సహాయంతో, తన అనుగ్రహంతో జరిగే పనికి దక్కే ప్రతిఫలంలో ఆయన వాటా కోరుకోడు. పవిత్ర గ్రంథం బైబిలులోని ‘కీర్తనలు’ ఆ యెహోవా ఘనతను అపారంగా కీర్తించాయి. అంతటి ఉదాత్తుడైన దైవం కోసం మనం మంచి పనులు చేయాలి. దేవుడి ప్రేరణతో మనం ఏ పనులైనా ప్రారంభించాలి. వాటిని సక్రమంగా, ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి చేసే శక్తి ఇవ్వాలని కోరుకోవాలి. మానవ జీవితంలోని ప్రతి సందర్భంలోనూ... నిరంతరం మార్గాన్ని నిర్దేశించేది ఆయనే. మనల్ని ముందుకు నడిపించేది దేవుడే. ఆయన నిర్దేశం ప్రకారం నడిచి, ప్రతిఫలాలను అందుకుంటున్న మనం దైవం పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞులుగా ఉండాలి.

Updated Date - 2022-01-21T05:30:00+05:30 IST