కడుపులో మూడు పిండాలు పెరుగుతున్నట్టు ఫీలింగ్.. వైద్యుడి వద్దకు వెళ్లిన మహిళకు భారీ షాక్.. ఏకంగా 10 కేజీల..

ABN , First Publish Date - 2022-03-20T02:18:42+05:30 IST

బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన ఓ మహిళ ఫలితం లేక విసిగిపోయింది. కడుపులో మూడు పిండాలను మోస్తున్నట్టు ఫీలింగ్! చివరికి ఆమె ఓ రోజు వైద్యుడి వద్దకు చెకప్ కోసం వెళ్లింది. రకరకాల పరీక్షల తరువాత.. ఆమె కడుపులో ఉన్నదేమీటో తెలుసుకుని అవాక్కవడం ఆమె వంతైంది. అసలేం జరిగిందంటే..

కడుపులో మూడు పిండాలు పెరుగుతున్నట్టు ఫీలింగ్.. వైద్యుడి వద్దకు వెళ్లిన మహిళకు భారీ షాక్.. ఏకంగా 10 కేజీల..

ఎన్నారై డెస్క్‌: బరువు తగ్గేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసిన ఓ మహిళ ఫలితం లేక విసిగిపోయింది. కడుపులో మూడు పిండాలను మోస్తున్నట్టు ఫీలింగ్! చివరికి ఆమె ఓ రోజు వైద్యుడి వద్దకు చెకప్ కోసం వెళ్లింది. రకరకాల పరీక్షల తరువాత.. ఆమె కడుపులో ఉన్నదేమీటో తెలుసుకుని అవాక్కవడం ఆమె వంతైంది. అసలేం జరిగిందంటే..


అమెరికాలో టెక్సాస్ రాష్ట్రానికి చెందిన జైమీ కార్న్‌వాల్(28) ఓ నర్సు. బరువు తగ్గేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోగా.. లావు పెరగడం ప్రారంభించింది. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి. ఇటీవల బూటు లేసులు ముడి వేసుకునేందుకు ముందుగు వంగితే.. వాంతి వచ్చినంత పని అయ్యేది. ఏదో సమస్య ఉందని ఆమెకు అర్థమైంది. దీంతో.. ఓ రోజు వైద్యుడిని సంప్రదించింది. రకరకాల పరీక్ష చేసిన అనంతరం.. కుడివైపున ఉన్న అండాంశయం పక్కన పెద్ద కణితి ఉన్నట్టు వైద్యులు గుర్తించారు.


 దాదాపు 10కేజీల బరువున్న ఆ కణితి కింద పడి అండాశయం కూడా నలిగిపోయినట్టు గుర్తించారు. శస్త్రచికిత్స ద్వారా కణితిని, అండాశయాన్ని తొలగించడం మినహా మరో మార్గం లేదని జైమీకి చెప్పారు. దీనికి ఆమె అంగీకరించడంతో.. వైద్యులు విజయవంతంగా ఆపరేషన్ చేసి.. కణితిని తొలగించారు. కాగా.. ఆమె ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.  

Updated Date - 2022-03-20T02:18:42+05:30 IST