Viral News: ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. ఈ మహిళలు చేసినట్టు అస్సలు చేయకండి!

ABN , First Publish Date - 2022-09-04T21:55:42+05:30 IST

టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. మనుషుల జీవన విధానంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. సాంకేతికత సాహాయంతో కావాల్సిన వాటిని కూర్చున్న చోటే పొందుతున్నారు. డబ్బులను ఒకప్పుడు బ్యాంకులకు వెళ్లి మాత్రమే విత్‌డ్రా చేసుకోవాల్సి వచ్చే

Viral News: ఆన్‌లైన్‌లో పేమెంట్స్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త.. ఈ మహిళలు చేసినట్టు అస్సలు చేయకండి!

ఇంటర్నెట్ డెస్క్: టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. మనుషుల జీవన విధానంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. సాంకేతికత సాహాయంతో కావాల్సిన వాటిని కూర్చున్న చోటే పొందుతున్నారు. డబ్బులను ఒకప్పుడు బ్యాంకులకు వెళ్లి మాత్రమే విత్‌డ్రా చేసుకోవాల్సి వచ్చేది. ఎవరికైనా నగదును పంపాలన్నా.. బ్యాంకు గుమ్మం తొక్కే పరిస్థితి ఉండేది. అయితే.. ఇపుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. స్మార్ట్‌ఫోన్ సహాయంతో అకౌంట్లో ఉన్న డబ్బును చాలా ఈజీగా వినియోగించుకుంటున్నారు. అలాగే ఇతరులకు సులభంగా ట్రాన్స్‌ఫర్(Money Transfer) చేస్తున్నారు. అయితే ఇలా డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ఈ మహిళలు పడ్డ ఇబ్బందులు మీరూ పడాల్సివస్తుంది. కాగా.. ఇంతకూ ఏం జరిగిందంటే..



అందరిలాగే ఉన్నత చదువులు పూర్తైన తర్వాత మంచి ఉద్యోగం సాధించి, ఆర్థికంగా సొంతకాళ్లపై నిలబడాలని మలేషియా(Malaysia)కు చెందిన ఫహదా బిస్తారి కూడా అనుకుంది. అనుకున్నట్టే చదువు పూర్తైన తర్వాత.. తన విద్యార్హతలకు తగిన ఉద్యోగంలో చేరింది. ఈ క్రమంలో చూస్తుండగానే నెల గడిచిపోయింది. అందుకు సంబంధించిన జీతం డబ్బులు ఆమె అకౌంట్లో జమ అయ్యాయి. ఈ నేపథ్యంలో బిస్తారి.. కీలక నిర్ణయం తీసుకుంది. మొదటి జీతాన్ని తన తల్లికి అందించాలని భావించింది. ఈ క్రమంలో వెంటనే ఫోన్ తీసి, అమౌంట్‌ను ట్రాన్స్ఫర్‌ చేసేసింది. ఆ తర్వాత చేసిన పొరపాటు గ్రహించి.. బిత్తరపోయింది. తన తల్లి అకౌంట్లోకి డబ్బు పంపించకుండా.. ఏమరపాటుతో గుర్తు తెలియని వ్యక్తి అకౌంట్లోకి నగదును ట్రాన్స్‌ఫర్ చేసినట్టు గుర్తించి విస్తుపోయింది.


 ఆ వెంటనే.. వాట్సప్‌ ద్వారా అతడిని సంప్రదించి.. డబ్బును తిరిగి తన అకౌంట్లోకి బదిలీ చేయాల్సిందిగా కోరింది. ఈ క్రమంలో అతడు..  అందుకు నిరాకరించాడు. అంతేకాకుండా.. ‘విరాళం వేశానని అనుకుని.. డబ్బులను మర్చిపో’ అని సూచించాడు. దీంతో తనకు ఎదురైన అనుభవాన్ని టిక్‌టాక్ ద్వారా ఆ మహిళ నెటిజన్లతో షేర్ చేసుకుంది. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌(Viral)గా మారింది. ఇదిలా ఉంటే.. ముంబైకి చెందిన ఓ మహిళ కూడా ఇలానే ఏమరపాటుతో బంధువులకు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయబోయి.. గుర్తు తెలియని వ్యక్తికి డబ్బులు పంపించింది. అయితే.. పోలీసుల సహాయంతో తిరిగి ఆ మొత్తాన్ని పొందింది. 


Updated Date - 2022-09-04T21:55:42+05:30 IST