ఆసియా దేశాలవారిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు.. న్యూయార్క్ నగరంలో మహిళ అరెస్టు!

ABN , First Publish Date - 2022-06-19T02:20:43+05:30 IST

ఆసియా దేశాల వారిపై ద్వేషపూర్తి వ్యాఖ్యలు చేసి మరో నలుగురి కళ్లల్లో కారం పొడి చల్లిన న్యూయార్క్ మహిళ మేడలిన్ బార్కర్‌ను స్థానిక పోలీసులు తాజాగా అరెస్టు చేశారు.

ఆసియా దేశాలవారిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు.. న్యూయార్క్ నగరంలో మహిళ అరెస్టు!

న్యూయార్క్ సిటీ: ఆసియా దేశాల వారిపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసి, మరో నలుగురి కళ్లల్లో కారం పొడి చల్లిన న్యూయార్క్ మహిళ మేడలిన్ బార్కర్‌ను స్థానిక పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. జూన్ 11 జరిగిన ఈ ఘటనకు సంబంధించి సీసీకెమెరా ఫుటేజీని పోలీసులు ఇటీవల విడుదల చేశారు. నలుగురు మహిళ కళ్లల్లో నిందితురాలు పెప్పర్ స్ప్రే జల్లినట్టు ఈ వీడియోలో రికార్డైంది. అంతేకాకుండా.. ఆ సమయంలో అటుగా వెళుతున్న ఓ ఆసియా సంతతి వ్యక్తిపై ద్వేషపూరిత వ్యాఖ్యలు కూడా చేసినట్టు బయటపడింది. ‘‘మీ సొంతదేశాలకు వెళ్లిపోండి’’ అంటూ ఆమె ద్వేషాన్ని వెళ్లగక్కినట్టు పోలీసులు తెలిపారు. ఇక.. నిందితురాలిపై ఏయే సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలో డిస్ట్రిక్ట్ అటార్నీ త్వరలో నిర్ణయించనున్నారు. కాగా.. కరోనా అనంతర పరిణామాల నేపథ్యంలో అమెరికాలో ఆసియా దేశాల వారిపై విద్వేషపూరిత నేరాలు పెరిగిపోతున్నాయని అధికారిక గణాంకాలే చెబుతున్నాయి.  

Updated Date - 2022-06-19T02:20:43+05:30 IST