తెల్లవారుజామున 4 గంటలకు విమానాశ్రయంలోకి మహిళ ఎంట్రీ.. చెక్ చేసినా ఏమీ దొరకలేదు.. డౌట్‌తో ఆ బ్యాగ్‌ను కోసి చూస్తే..

ABN , First Publish Date - 2021-12-20T15:55:07+05:30 IST

రాజస్థాన్‌లోని జైపూర్ ఎయిర్‌పోర్టు వద్ద కస్టమ్స్ టీమ్..

తెల్లవారుజామున 4 గంటలకు విమానాశ్రయంలోకి మహిళ ఎంట్రీ.. చెక్ చేసినా ఏమీ దొరకలేదు.. డౌట్‌తో ఆ బ్యాగ్‌ను కోసి చూస్తే..

రాజస్థాన్‌లోని జైపూర్ ఎయిర్‌పోర్టు వద్ద కస్టమ్స్ టీమ్ ఒక మహిళను రూ. 15 కోట్ల విలువచేసే హెరాయిన్‌తో సహా పట్టుకున్నారు. ఈ మహిళ షార్జా నుంచి ఎయిర్ అరేబియా ఫ్లయిట్ నుంచి ఇండియాకు వచ్చింది. జైపూర్ ఎయిర్ పోర్టు వద్ద అధికారులు ఆమె బ్యాగును చెక్ చేయగా రెండు కిలోల హెరాయిన్ లభ్యమయ్యింది. వివరాల్లోకి వెళితే జైపూర్ ఎయిర్ పోర్టుకు ఆదివారం ఉదయం 4 గంటల సమయంలో ఎయిర్ అరేబియాకు చెందిన ఫ్లయిట్ నంబర్ జీ 9-435 వచ్చింది. ఫ్లయిట్‌లో కెన్యాకు చెందిన ఒక మహిళ ఉంది. అప్పటికే ఆమెకు సంబంధించి లుక్ అవుట్ నోటీసు జారీ అయ్యింది. 


ఢిల్లీలో నవంబరు 13న ఉగాండాకు చెందిన ఇద్దరు మహిళలను రూ. 90 కోట్ల విలువైన హెరాయిన్‌తో సహా పట్టుకున్నారు. ఈ నేపధ్యంలోనే మరికొందరు మహిళలు కూడా భారీ ఎత్తున హెరాయిన్ రహస్యంగా తరలిస్తుండవచ్చని అధికారులు అనుమానించారు. ఈ కారణంగానే ఎయిర్ పోర్టులలో తనిఖీలను ముమ్మరం చేశారు. తాజాగా జైపూర్‌కు కాన్యా నుంచి వచ్చిన మహిళను నార్కొటెక్స్ అధికారులు అడ్డుకున్నారు. బ్యాగును ఎక్స్‌రేతో చెక్ చేసి, ఏదో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ బ్యాగును కట్టర్ సాయంతో కత్తిరించి తెరిచి చూశారు. బ్యాగులో ఉన్న 2 కిలోల 150 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. హెరాయిన్ శాంపిల్‌ను సెంట్రల్ ల్యాబ్‌కు పంపారు. ప్రస్తుతం అధికారులు ఆమెను విచారిస్తున్నారు.

Updated Date - 2021-12-20T15:55:07+05:30 IST