బ్యాంకు అధికారులు తన బంగారు నగలు దోచుకున్నారంటూ కేసు పెట్టిన మహిళ.. అసలేం జరిగిందంటే..

ABN , First Publish Date - 2022-05-19T09:16:56+05:30 IST

పెళ్లి సమయంలో వచ్చిన బంగారం అంతా తీసుకెళ్లి బ్యాంకు లాకర్లో దాచి పెట్టిందా ఇల్లాలు. తాజాగా వెళ్లి లాకర్ తెరిస్తే.. అందులో ఒక్క బంగారం ముక్క కూడా లేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసిందామె. తనకు బ్యాంకు అధికారులపైనే అనుమానం ఉందని ఆమె ఆరోపించింది...

బ్యాంకు అధికారులు తన బంగారు నగలు దోచుకున్నారంటూ కేసు పెట్టిన మహిళ.. అసలేం జరిగిందంటే..

పెళ్లి సమయంలో వచ్చిన బంగారం అంతా తీసుకెళ్లి బ్యాంకు లాకర్లో దాచి పెట్టిందా ఇల్లాలు. తాజాగా వెళ్లి లాకర్ తెరిస్తే.. అందులో ఒక్క బంగారం ముక్క కూడా లేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసిందామె. తనకు బ్యాంకు అధికారులపైనే అనుమానం ఉందని ఆమె ఆరోపించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో వెలుగు చూసింది. అంతకుముందు కూడా ఈ బ్యాంకులో మొత్తం 11 లాకర్లు చోరీ అయినట్లు కేసు నమోదైంది. ఈ లాకర్ల యజమానులకు బ్యాంకు నుంచి 75 శాతం నష్టపరిహారం లభించింది. 


అయితే తాజాగా ఆర్తీ తివారీ అనే మహిళ బ్యాంకులో తన లాకర్ తెరవడానికి వచ్చింది. కానీ మేనేజర్ రాంప్రసాద్, లాకర్ ఇంచార్జి శుభమ్ మాళవీయ ఆమెను లాకర్ రూంలోకి రానివ్వలేదు. రకరకాల కారణాలు చూపించి వెనక్కు పంపేశారు. ఆ తర్వాత మళ్లీ రెండు సార్లు బ్యాంకుకు వెళ్లిన ఆమెను.. ప్రతీసారి లాకర్ తెరవకుండా వాళ్లు అడ్డుకుననారు. దీంతో అనుమానం వచ్చిన ఆర్తీ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారి సమక్షంలో బ్యాంకుకు వెళ్లి లాకర్ తెరవడానికి ప్రయత్నించారు. 


కానీ తాళం లాకర్‌లో విరిగిపోవడంతో.. లాకర్ కంపెనీ నుంచి పని వాళ్లను తెప్పించారు. తీరా చూస్తూ లాకర్‌లో ఒక్క చిల్లి గవ్వ కూడా లేదు. దాంతో మనేజర్, లాకర్ ఇంచార్జికి ఈ విషయం తెలిసే తనను లాకర్ తెరవకుండా అడ్డుకున్నారని ఆమె ఆరోపించింది. ఈ విషయం గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని బ్యాంకుకు సంబంధించిన పై అధికారులు చెప్తున్నారు. దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.


Updated Date - 2022-05-19T09:16:56+05:30 IST