కొన్ని రోజులుగా నీరసం, అనారోగ్యం.. ఇంటి భోజనం మానేస్తే మెరుగుపడిన ఆరోగ్యం.. విషయం ఏంటని ఆరా తీస్తే వెలుగులోకి షాకింగ్ విషయం!

ABN , First Publish Date - 2022-02-07T20:49:02+05:30 IST

అతను ఓ బిజినెస్ మ్యాన్.. కొన్ని రోజులుగా అతనికి చాలా నీరసంగా, త్వరగా అలసిపోతున్నట్టు అనిపించడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాడు..

కొన్ని రోజులుగా నీరసం, అనారోగ్యం.. ఇంటి భోజనం మానేస్తే మెరుగుపడిన ఆరోగ్యం.. విషయం ఏంటని ఆరా తీస్తే వెలుగులోకి షాకింగ్ విషయం!

అతను ఓ బిజినెస్ మ్యాన్.. కొన్ని రోజులుగా అతనికి చాలా నీరసంగా, త్వరగా అలసిపోతున్నట్టు అనిపించడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాడు.. షుగర్ లెవెల్స్ తగ్గి ఉంటాయని చెప్పి డాక్టర్ మందులు రాశాడు.. అయినా ఫలితం కనిపించలేదు.. కొన్ని రోజులు ఇంటి భోజనం మానేసి బయట తినడం ప్రారంభించాడు.. ఆశ్చర్యకరంగా అప్పట్నుంచి ఆరోగ్యం మెరుగుపడింది.. విషయం ఏంటని స్నేహితుడి ద్వారా ఆరా తీశాడు.. తనకు ఇచ్చే ఆహారం, నీటిలో భార్య మందులు కలుపుతోందని తెలిసి షాకయ్యాడు.. చివరకు పోలీసులను ఆశ్రయించాడు. 


కేరళలోని కొట్టాయం జిల్లాలోని పాలా పట్టణాంలో సతీష్‌ అనే వ్యక్తి తన భార్య ఆశాతో కలిసి నివసిస్తున్నాడు. 2006లో వీరి వివాహం జరిగింది. కొన్ని రోజుల వరకు బాగానే ఉన్నారు. ఆ తర్వాత చిన్న చిన్న విషయాలకు కూడా వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. కొన్ని రోజుల క్రితం సతీష్ కు అనారోగ్యం మొదలైంది. తరచుగా నీరసంగా అనిపించడం, త్వరగా అలసిపోయినట్టు అనిపించడాన్ని సతీష్ గమనించాడు. వెంటనే వైద్యుణ్ని సంప్రదించాడు. షుగర్‌ లెవల్స్‌ పడిపోవడం వల్ల ఇలా జరుగుతుందని డాక్టర్ చెప్పాడు. డాక్టర్ రాసిన మందులు వాడినా సతీష్‌కు ప్రయోజనం కనిపించలేదు. 


ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్ నుంచి ఇంటి భోజనం మానేశాడు. కొన్ని రోజులకు అతని ఆరోగ్యం క్రమంగా మెరుగైంది. దీంతో భార్యను అనుమానించాడు. విషయం ఏంటని స్నేహితుడి ద్వారా ఆరా తీశాడు. సతీష్ స్నేహితుడు ఆశ వద్దకు వెళ్లి మాట్లాడగా.. తాను సతీష్ ఆహారంలో, తాగే నీటిలో కొన్ని మందులు కలుపుతున్నట్టు చెప్పింది. దీంతో సతీష్ తన ఇంటి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించి తన ఆహారంలో భార్య ఏవో మందులు కలుపుతున్నట్టు తెలుసుకున్నాడు. పోలీసులను సంప్రదించి భార్యపై కేసు పెట్టాడు. పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి విచారణ ప్రారంభించారు. సతీష్ తన ఆస్తులు మొత్తాన్ని తల్లిదండ్రులు, సోదరుల పేర్ల మీదే పెట్టాడని, తనకు ఏమీ ఇవ్వడం లేదని, అందుకే అలా చేశానని ఆశ తెలిపింది.    

Updated Date - 2022-02-07T20:49:02+05:30 IST