ఆస్ట్రేలియాలో ఓ యువతికి చేదు అనుభవం!

ABN , First Publish Date - 2021-01-17T02:26:24+05:30 IST

ఆస్ట్రేలియాలో ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. తాను ధరించిన దుస్తుల కారణంగా ఎయిర్‌లైన్ సిబ్బంది ఆమెను విమానం ఎక్కనీయకుండా అడ్డుకున్నారు. కాగా.. సదరు యువతి తాను ఎదుర్కొ

ఆస్ట్రేలియాలో ఓ యువతికి చేదు అనుభవం!

సిడ్నీ: ఆస్ట్రేలియాలో ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. తాను ధరించిన దుస్తుల కారణంగా ఎయిర్‌లైన్ సిబ్బంది ఆమెను విమానం ఎక్కనీయకుండా అడ్డుకున్నారు. కాగా.. సదరు యువతి తాను ఎదుర్కొన్న ఇబ్బందికర పరిస్థితిని వివరిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ అంశం వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 23ఏళ్ల కేథరిన్ బామ్టన్ బుధవారం రోజు అడిలైడ్ నగరం నుంచి గోల్డ్ కోస్ట్‌కు వెళ్లేందుకు వర్జిన్ ఆస్ట్రేలియా ఎయిర్‌లైన్‌ విమానం టికెట్‌ను కొనుగోలు చేసింది. అనంతరం విమానం వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో కేథరిన్‌ను విమానం ఎక్కనీయకుండా ఎయిర్‌లైన్ సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో షాక్ గురైనట్టు చెప్పిన ఆమె..‘సారీ.. మీ ధరించిన దుస్తులు  అభ్యంతరకరంగా ఉన్నాయి. శరీర భాగం ఎక్కువగా కనిపిస్తోంది. ఇటువంటి దుస్తులు ధరించిన వారు.. ఈ విమానంలో ప్రయాణించడానికి వీలులేదని మా ఫైలట్ చెప్పమన్నాడు’ అంటూ విమాన సిబ్బంది చెప్పిన మాటలను విని విస్తుపోయినట్టు తెలిపింది.


ఈ క్రమంలో చివరికి చేసేదేమీ లేక.. తాను ధరించిన దుస్తులపై మరో టాప్‌ను ధరించి విమానంలో ప్రయాణించినట్టు తెలిపింది. అనంతరం ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వివరిస్తూ.. సదరు ఫైలట్ తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ‘అందరి ముందు అలా చెప్పడంతో.. అక్కడున్నవారంతా నన్నే చూశారు. దీంతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. దీనికి కారణమైన ఫైలట్ వెంటనే క్షమాపణ చెప్పాలి’ అని సోషల్ మీడియా‌లో పోస్ట్ చేసింది. అదికాస్తా వైరల్ కావడంతో.. ఎయిర్‌లైన్ ప్రతినిధి స్పందించారు. ఈ ఘటనపై అధికారికంగా ఎటువంటి ఫిర్యాదును తాము అందుకోలేదని.. అయితే ఈ అంశాన్ని పరిశీలించనున్నట్టు చెప్పారు. 


Updated Date - 2021-01-17T02:26:24+05:30 IST