
ఒక హాస్టల్‌లో ఉండే యువతి ఒక బర్త్ డే పార్టీకి వెళ్లింది. అక్కడ కొందరు ఆమెకు బలవంతంగా మద్యం తాపించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని గురుగ్రామ్ సెక్టార్-40లో వెలుగు చూసింది.
బాధితురాలు నివసిస్తున్న హాస్టల్ యజమాని.. అతని స్నేహితుడి బర్త్ డే పార్టీని హాస్టల్‌లోనే ఏర్పాటు చేశాడు. పార్టీకి ఆహ్వానించడంతో బాధితురాలు వెళ్లింది. అక్కడ యజమాని, అతని స్నేహితుడు కలిసి ఆమెకు మద్యం తాపించారు. అనంతరం యజమాని స్నేహితుడు ఆమెను బలాత్కరించాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదరించారు. ఈ ఘటన ఏప్రిల్ 16న జరిగింది.
ఇది జరిగిన 20 రోజుల తర్వాత ధైర్యం చేసి యువతి.. పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొన్నారు. ప్రస్తుతం హాస్టల్ యజమాని, అతని స్నేహితుడు పరారీలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి